భారతీయ చలన చిత్ర రంగంలో సల్మాన్ ఖాన్(salman khan)నట ప్రస్థానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.ఇరవై మూడు సంవత్సరాల వయసులో తన సినీ జర్నీని ప్రారంభించిన సల్మాన్ ఇప్పటి వరకు వందకి పైగా చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం అయన వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు. ఈ ఏజ్ లో కూడా యంగ్ హీరోలకి పోటీగా ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ తనని తానే సాటి అనిపించుకుంటున్నాడు.
సల్మాన్ ఇంత వరకు పెళ్లి చేసుకోలేదనే విషయం అందరకి తెలిసిందే. గతంలో ఎంతమందితో ప్రేమాయణం నడిపిన సల్మాన్ తన ప్రేమని పెళ్లి దాకా తీసుకెళ్లలేక పోయాడు.ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నా కూడా రీసెంట్ గా సరికొత్త రీజన్ ఒకటి సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది.సల్మాన్ 1994 లోహమ్ అప్ కె హై కౌన్ అనే మూవీలో చేసాడు.తెలుగులో ప్రేమాలయం అనే పేరుతో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ మూవీ షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతున్నపుడు సల్మాన్ అక్కడి దగ్గరలో ఉన్న ఒక అడవిలోకి వెళ్లి ఆపరేషన్ కృష్ణ జింక ని నిర్వహించాడని, ఆ తర్వాత దాన్ని చంపి తిన్నాడనే అభియోగాలు వచ్చాయి. బిష్ణోయ్ అనే ఒక తెగ ఎంతో పవిత్రంగా భావించే కృష జింక ని సల్మాన్ చంపి తినడం వల్లనే సల్మాన్ కి పెళ్లి అవ్వటం లేదనే వార్తలు వస్తున్నాయి.
సల్మాన్ ప్రస్తుతం మురుగదాస్(murugudas)దర్శకతంలో సికందర్(sikandar)అనే కొత్త సినిమా చేస్తున్నాడు. రష్మిక(rashmika madanna)హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇటీవల కృష్ణ జింక ని చంపిన కేసులోనే సల్మాన్ ని చంపుతామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించిన నేపథ్యంలో భారీ బందోబస్తు మధ్య షూటింగ్ జరుగుతుంది.