![]() |
![]() |
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్(93) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ, తాతయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషల్ అయింది అలియా.
"మా తాతయ్య.. నా హీరో. 93 ఏళ్ళ వరకు గోల్ఫ్ ఆడారు.. 93 ఏళ్ళ వరకు పనిచేశారు. నాకోసం ఆమ్లెట్ వేసిచ్చేవారు. ఎన్నో కథలు చెప్పేవారు. వయోలిన్ వాయించేవారు. తన ముని మనవరాలితో కూడా ఆడుకున్నారు. క్రికెట్ ని, స్కెచింగ్ ని, కుటుంబాన్ని ప్రేమించారు. చివరి క్షణం వరకు ఆయన తన జీవితాన్ని ఎంతో ప్రేమించారు. ఇప్పుడు ఆయన లేరన్న విషయం మనసుకి బాధ కలిగిస్తున్నా, అదే సమయంలో ఆనందంగానూ ఉంది. ఎందుకంటే మా తాతయ్య నాకు బోలెడంత ఆనందాన్ని అందించారు. ఆయన దగ్గర పెరగడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను. మనం మళ్ళీ కలుసుకునే వరకు ఈ జ్ఞాపకాలన్నీ నాతోనే భద్రపరచుకుంటాను" అని అలియా భట్ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు అలియా భట్ తాతయ్య నరేంద్ర రజ్దాన్ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.
![]() |
![]() |