![]() |
![]() |
తెలుగులో పవన్ కల్యాణ్, వెంకటేష్ నటించిన సినిమా గోపాల గోపాల. ఈ సినిమా హిందీ వెర్షన్ ఓ మై గాడ్. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ హీరోగా నటించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించారు. ఓ మై గాడ్ సీక్వెల్ కోసం ఫస్ట్ పార్ట్ ని ఆదరించిన వారందరూ తెగ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సీక్వెల్‌ను ఓటీటీలో విడుదల చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. వూట్‌లోగానీ, జియో సినిమాలోగానీ ఉండొచ్చనే మాట కూడా వినిపిస్తోంది. ఈ సీక్వెల్‌కి అక్షయ్‌కుమార్ కూడా నిర్మాతల్లో ఒకరు. మరి ఈయనకు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడం ఇష్టం లేదట. థియేటర్లలో ఈ కాన్సెప్ట్ కి మంచి ఆదరణ వస్తుంది.
అందుకే డైరక్ట్ థియేటర్లలో విడుదల చేద్దామని అంటున్నారట. అయితే, ఆ విషయం మీద కూడా మిగిలిన నిర్మాతలకు పూర్తి క్లారిటీ ఇవ్వడం లేదట. ప్రస్తుతం బడేమియా చోటేమియా సినిమా షూటింగ్‌లో ఉన్నారు అక్షయ్‌కుమార్. టైగర్ ష్రాఫ్ కూడా ఈ మూవీలో నటిస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం స్కాట్లాండ్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం పనుల నుంచి కాస్త బ్రేక్ తీసుకుని ఓమైగాడ్2 గురించి ఆలోచిస్తానని అంటున్నారట అక్షయ్. బీ,సీ సెంటర్లలోనూ మంచి బిజినెస్ చేయగల సత్తా ఉన్న కంటెంట్ ఓమైగాడ్2లో ఉందన్నది మిగిలిన నిర్మాతల నమ్మకం. అయితే గతేడాది అక్షయ్‌కుమార్ నటించిన రక్షా బంధన్, రామ్ సేతు సినిమాలకు కనీస వసూళ్లు కూడా దక్కలేదు. ఇప్పుడు ఓ మై గాడ్2 విషయంలోనూ అదే రిపీట్ కాదన్న గ్యారంటీ ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సెల్ఫీని కూడా మేకర్స్ డిజిటల్ రిలీజ్ చేద్దామని అన్నారు. కానీ అక్షయ్ అందుకు ఒప్పుకోకుండా థియేటర్‌లో విడుదల చేశారు. ఫలితం శూన్యం. అందుకే ఓ మై గాడ్2 విషయంలో నిర్ణయం తీసుకోవడానికి తర్జనభర్జనలు జరుగుతున్నాయి. అక్షయ్‌కుమార్ సరసన యామీ గౌతమ్, పంకజ్ త్రిపాఠి నటించిన సినిమా ఓఎంజీ2. ఈ సినిమాలో భారతీయ విద్యావ్యవస్థ, వయోజన విద్య గురించి ప్రస్తావన ఉంది.
![]() |
![]() |