![]() |
![]() |
బాలీవుడ్ ఫిలిం మేకర్ బోని కపూర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు తమిళనాడులో వైరల్ అవుతుంది. ఆయన తనయ జాన్వి కపూర్ తమిళ సినిమాల్లో నటించట్లేదని, ఇప్పటిదాకా ఏ సినిమాకు సంతకం చేయలేదని, ఫాల్స్ రూమర్స్ ను ఎవరు నమ్మవద్దని స్టేట్మెంట్ ఇచ్చారు బోనీకపూర్. ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ చేసిన వాళ్లపై చర్యలు తప్పంటున్నారు బోనీకపూర్. దీని గురించి బోనీకపూర్ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.
`` నేను మీ అందరికి చెప్పదలుచుకున్న విషయం ఒకటే. జాన్వీ కపూర్ ఇప్పటిదాకా ఏ తమిళ సినిమాకు సంతకం చేయలేదు. దయచేసి ఇలాంటి ఫాల్స్ రూమర్స్ గురించి రాయకండి`` అంటూ ట్వీట్ చేశారు బోనీ కపూర్. ఇంతకీ బోనీకపూర్ అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని ఆరా తీస్తున్నారు జనాలు. లింగుస్వామి దర్శకత్వంలో కార్తీ, తమన్న జంటగా నటించిన సినిమా పైయ్య. ఈ సినిమాకు సీక్వెల్ గా ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి లింగుస్వామి ప్లాన్ చేస్తున్నారని న్యూస్ వైరల్ అయింది. ఈ సినిమాలో ఆర్య హీరోగా నటిస్తున్నారన్న వార్తలు వినిపించాయి. ఆర్య కు జోడిగా జాన్వి కపూర్ కనిపిస్తారని న్యూస్ వైరల్ అయింది. ఈ సినిమా జాన్వికి ఫస్ట్ తమిళ్ సినిమా అవుతుందని కూడా చాలామంది మాట్లాడుకున్నారు. తన కూతురు ఎలాంటి సినిమాలోనూ నటించట్లేదని అందుకే క్లారిటీ ఇచ్చారు బోనీ.
తెలుగు సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా కొరటాల శివ సినిమాలో జాన్వీ నటిస్తున్నట్టు కూడా వార్తలున్నాయి. అయితే దీని గురించి మాత్రం ఏమీ మాట్లాడలేదు బోనీకపూర్. జాన్వి నటించిన మిలి ఇటీవల విడుదలైంది. ఈ సినిమా తమిళ సినిమా కోలమావు కోకిలకు రీమేక్. నయనతార నటించిన తమిళ సినిమా అది. జాన్వి నెక్స్ట్ సినిమా బవాల్. ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే సినిమాలో రాజ్ కుమార్ రావుతో నటిస్తున్నారు జాన్వీ. ఈ సినిమాలో ఆమె క్రికెటర్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం క్రికెట్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు.
![]() |
![]() |