![]() |
![]() |
బాలీవుడ్ నటి కృతిసనన్ తన సక్సెస్ సీక్రెట్లను అభిమానులతో పంచుకున్నారు. ఒక పర్టిక్యులర్ విషయానికి స్టక్ కాకుండా, ముందుకు వెళ్తూ ఉండాలని అన్నారు. ఈ ఏడాది కృతి ఆశిస్తున్న విషయాల గురించి మాట్లాడుతూ ``నా నుంచి ప్రేక్షకులు ఎక్కువ పాత్రలను కోరుకుంటున్నారు. షెహజాదా సినిమాలో గ్లామరస్‌గా కనిపిస్తాను. ఆదిపురుష్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. అందులో జానకిగా నన్ను నేను చూసుకోవడానికి ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను. గణ్‌పత్ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నాను. ఇంతకు మునుపు ఎప్పుడూ నేను యాక్షన్ సీక్వెన్స్ చేయలేదు. ఈ సినిమాలో బైక్ నడుపుతాను. పంచ్‌లు విసురుతాను. వెపన్స్ వాడుతాను. అవన్నీ ప్రేక్షకులకు కొత్తగా ఉంటాయి.
ఇవి కాకుండా, షాహిద్ కపూర్‌తో ఓ రొమాంటిక్ సినిమా ఉంటుంది. క్రూలో ముగ్గురు లేడీస్‌లో ఒకదాన్నిగా కనిపిస్తాను. ఆ కథ చాలా ఫన్నీగా ఉంటుంది`` అని అన్నారు.``నేను ఇప్పటికి చాలా సినిమాలు చేశాను. అయితే వాటిలో ఒకదానికి ఇంకోదానితో ఎక్కడా పొంతన ఉండదు. లైఫ్‌లో సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా అక్కడితో ఆగిపోకూడదు. ముందుకు సాగుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు వైవిధ్యంగా ఉండాలి. అప్పుడే లైఫ్ ఫ్రెష్‌గా, ప్రశాంతంగా సాగుతూ ఉంటుంది`` అని అన్నారు.కృతిసనన్‌కి నార్త్ ఇండస్ట్రీలోనే కాదు, దక్షిణాదిన కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాగచైతన్య దోచెయ్, మహేష్ సినిమా వన్ నేనొక్కడినే సినిమాలతో తెలుగువారికి సుపరిచితురాలు ఈ భామ. ప్రభాస్‌తో నటించే ఆదిపురుష్ కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
![]() |
![]() |