![]() |
![]() |
అదేంటో గాని ఈ ఏడాది రెండోసారి కూడా విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది జానకి ఆలియాస్ కృతి సనన్‌కి. ఆమె నటించిన ఆదిపురుష్ ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ వీఎఫ్ ఎక్స్ డిలే కావడంతో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. ఇప్పుడు మరో సినిమా కూడా వాయిదా పడింది. ఆ సినిమా షెహ్జాదా. కార్తిక్ ఆర్యన్‌తో నటించిన సినిమా షెహ్జాదా. అలవైకుంఠపురంలో సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. షెహ్జాదాను ఫిబ్రవరి 10న విడుదల చేస్తామని ముందు అనౌన్స్ చేశారు. అయితే బాలీవుడ్ లో పఠాన్ సినిమా సునామీ సృష్టిస్తుండటంతో తమ సినిమాను వారం రోజులు పాటు వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నారు షెహ్జాదా మేకర్స్. పఠాన్ సినిమాకు ఐదు రోజుల్లో 500 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చిన విషయం తెలిసిందే.
దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పఠాన్ దుమ్ము రేపుతోంది. బాలీవుడ్లో ఇంతకుముందు చాలా సినిమాల రికార్డులను దాటేస్తోంది పఠాన్. మంచి కంటెంట్ ఉన్న సినిమా పడితే బాలీవుడ్ సినిమాలకు ఉన్న రేంజ్ ఏంటో మరోసారి పఠాన్ చూపిస్తోందని అంటున్నారు ట్రేడ్ పండిట్స్. ఆ సినిమా ముందు షెహ్జాదాని విడుదల చేయడం ఎందుకు అనుకున్న మేకర్స్ ఈ సినిమాను వారం రోజులు పాటు పోస్ట్ పోన్ చేశారు. కృతి సనన్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను రోహిత్ ధావన్ తెరకెక్కించారు. భూషణ్ కుమార్, అల్లు అరవింద్, అమన్గిల్ నిర్మించారు. వారం రోజులు ఆలస్యంగా వచ్చినంత మాత్రాన వచ్చే ఇబ్బంది ఏమీ లేదు... మంచి సినిమాకు సరైన థియేటర్స్ కచ్చితంగా దొరకాలి. అలాంటి థియేటర్స్ దొరికినప్పుడు కలెక్షన్లకు కొదవేం ఉండదు అని నమ్మి సినిమాను పోస్ట్ పోన్ చేశారు మేకర్స్.
![]() |
![]() |