పఠాన్ తర్వాత బాలీవుడ్లో రీసెంట్ హిట్ తూ జూటీ మే మక్కర్. రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన సినిమా అది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ ఫిజిక్‌కి ఫిదా కాని వారు ఉండరు. బాలీవుడ్ స్టార్స్ అందరూ చెమటోడ్చి కావాలనుకున్న ఫిజిక్‌ని అచీవ్ చేస్తూనే ఉంటారు. వారి జిమ్ లుక్స్ ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంటాయి. అయితే శ్రద్ధ కపూర్ నెవర్ బిఫోర్ అవతార్‌లో హల్చల్ చేశారని అందరూ మెచ్చుకుంటున్నారు. రేజర్ షార్ప్ వెయిస్ట్ లైన్, టోన్డ్ బాడీతో చాలా షార్ప్ గా కనిపిస్తున్నారు శ్రద్ధ.
శ్రద్ధ ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేసిన మాహెక్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి స్పెషల్‌గా మాట్లాడారు. ``పదేళ్లుగా నేను శ్రద్ధకి ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాను. తూ జూటీ మే మక్కర్ సినిమాకు సైన్ చేయగానే హాట్, టోన్డ్ బాడీ కావాలని లవ్ రంజన్‌గారు చెప్పారు. రిప్డ్ బాడీ వద్దని అన్నారు. దానికి తగ్గట్టే రెండు ఫేజుల్లో డైట్‌ని ప్లాన్ చేశాం. ఫస్ట్ ప్లాన్‌లో శ్రద్ధ కాళ్ల మీద ఫోకస్ చేశాం. డ్యాన్సింగ్ స్టెప్పుల్లోనూ, షార్ట్ డ్రస్సుల్లోనూ ఆమె కాళ్లు అందంగా కనిపించాలన్నది మా ప్లాన్. కార్బ్స్, ప్రొటీన్స్, ఫ్యాట్‌ని డైట్లో ఇంక్లూడ్ చేశాం. శ్రద్ధ వెజిటేరియన్ డైట్ తీసుకున్నారు.
సెకండ్ ఫేజ్‌లో పొట్ట భాగం మీద ఫోకస్ చేశాం. దాదాపు 14గంటల పాటు ఇంటర్మిట్టన్ ఫాస్టింగ్ని ప్రిఫర్ చేశాం. ఆకు కూరల శాలడ్స్, వెజిటెబుల్ సూప్స్, బఠానీలు, సియా సీడ్స్, బ్లూ బెర్రీ స్మూదీ వంటి వాటితో హై ప్రొటీన్, లో కార్బ్ డైట్‌ని ఫిక్స్ చేశాం. వీటితో పాటు మంచి విటమిన్లు అందించాం. ఫిజికల్ ట్రైనింగ్ కూడా చాలా బాగా చేశారు. అంత శ్రద్ధ పెట్టారు కాబట్టే ఇవాళ అందరి నుంచీ ప్రశంసలు అందుతున్నాయి. సన్నగా బాగా కనిపిస్తున్నారు అని అన్నారు. శరీరంలో కొవ్వు శాతం తక్కువగా ఉన్నవాళ్లు మాత్రమే అందమైన ఫిజిక్‌తో ఆకట్టుకుంటారన్నది మాహెక్ చెప్పే మాట.