![]() |
![]() |
షారుక్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ బాక్స్ ఆఫీస్‌ని బద్దలు కొడుతోంది. దీపిక పదుకొనే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జాన్ అబ్రహం కీలకపాత్రలో నటించారు. షారుక్ ఖాన్‌తో పలు సినిమాలను తెరకెక్కించింది యష్ రాజ్ సంస్థ. పఠాన్ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న సందర్భంగా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు కింగ్ ఖాన్. `` రిస్క్ టేకింగ్ సంస్థ, గట్సి ప్రొడక్షన్ హౌస్ అంటూ యష్‌రాజ్ ఫిలిమ్స్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. గ్రేటెస్ట్ ఫిలిం ఫ్యాన్ అంటూ ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్ ని పొగిడారు కింగ్ కాంగ్ షారుక్ ఖాన్. ఎస్ రాజ్ ఫిలిమ్స్ గురించి చెప్తూ గ్రేటెస్ట్ ఫిలిమ్స్ ని ఇప్పటిదాకా చాలానే తెరకెక్కించింది. కొన్నిసార్లు కొన్ని ఆడలేదు కూడా. అయినా కూడా వాళ్ళకి సినిమాల మీదున్న ప్యాషన్ ఏమాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుని తెరమీద వాటిని చూపించడానికి ప్రయత్నిస్తూనే ఉంది యష్‌రాజ్ ఫిలిమ్స్.
జస్ట్ గత వైభవాన్ని తలచుకొని ఏవో చెప్పావని ఏదో చేశామని చెప్పుకోవడం యష్ రాజ్ ఫిలిమ్స్ విధానం కాదు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని తహతలాడుతుంది ఈ సంస్థ. స్పై సినిమాలను నిర్మించడానికి ఎవరికైనా సరే భారీ బడ్జెట్ అవుతుంది. ఏమాత్రం బడ్జెట్ కి వెరవకుండా సినిమాలు తీయడానికి ముందుకు వస్తుంది యష్ రాజ్ ఫిలిమ్స్. అంతేకాదు, ఈ స్పై మూవీ తరహా సినిమాలను తీయాలంటే వీఎఫ్ ఎక్స్ ఎంతో కీలకం. అందుకే విఎఫ్ఎక్స్ స్టూడియోను కూడా స్వయంగా ప్రారంభించుకొని ఈ తరహా సినిమాలకు ఏం కావాలో అది అందిస్తోంది ఈ సంస్థ. ఎప్పుడూ ప్రొఫెషనల్ గా ఉంటుంది. ఆ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ అంతే ఆప్యాయంగా ఉంటారు. సక్సెస్ఫుల్ సినిమాలు తీయాలన్న ఆలోచనతో పనిచేస్తారు. సినిమా కోసం చచ్చిపోవడానికైనా సిద్ధంగా లేని వాళ్ళు సినిమాల్లో బతకడానికి అనర్హులు అన్నది నా సిద్ధాంతం. యష్‌రాజ్ బ్యానర్ అలాంటి సినిమా సంస్థ. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూ సరికొత్త సబ్జెక్టులను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో తమకంటూ గొప్ప స్థానాన్ని పదిలం చేసుకుంది`` అని పొగిడారు షారుఖ్. ఆయన నటించిన పఠాన్ ఈనెల 25న విడుదలైంది.
![]() |
![]() |