![]() |
![]() |
బాలీవుడ్ నటి కరీనాకపూర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ల గురించి ఎగ్జయిటింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సంవత్సరం ఆమె ఓటిటి డెబ్యూ కూడా చేస్తున్నారు. .మరోవైపు మెహత దర్శకత్వంలో బకింగ్‌హామ్ మోడల్స్ లో నటించారు .ఈ థ్రిల్లర్‌లో కరీనా డిటెక్టివ్ గా కనిపిస్తారు.
ఇటీవల వెరైటీ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీనా చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. `క్రూ` అనే సినిమా షూటింగ్లో తాను మార్చి నుంచి పాల్గొంటానని అన్నారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ తన సినిమా పనుల్లో ఉన్నారు. అమృత్‌సర్‌లో అతని సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ షూటింగ్ పూర్తయి సైఫ్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కరీనా క్రూ సినిమా షూటింగ్ కి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. తన తల్లి అయిన తర్వాత పిల్లలకి అందుబాటులో తప్పకుండా ఉంటున్నారు. ఇంట్లో ఎప్పుడూ తాను గాని సైఫ్ గాని ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటున్నామని అన్నారు. సైఫ్‌కి షూటింగ్స్ ఉంటే తాను ఇంట్లో ఉంటానని, అతను తిరిగి వచ్చాక తన షూటింగ్స్ ప్లాన్ చేసుకుంటానని అన్నారు కరీనా.
ఇంట్లో ఎంత సేపు ఉన్నామన్నది కాదని, పిల్లలతో ఎంత క్వాలిటీ టైం గడిపామన్నది తల్లిదండ్రులుగా ఎవరైనా గుర్తు పెట్టుకోవాల్సిన విషయమని అన్నారు. క్రూ సినిమా ఆద్యంతం కామెడీగా ఉంటుందని అన్నారు. గ్లాస్ అండ్ గ్లామర్ గా ఉంటుందన్నారు. ఈ సినిమా ఫక్తు హిందీ మసాలా కమర్షియల్ సినిమాకు ఎగ్జాంపుల్‌గా ఉంటుందని అన్నారు. ఎయిర్‌లైన్‌లో పనిచేసే ముగ్గురు అమ్మాయిలు, వారి జీవితంలో ఎదురైన అనుభవాలు, వాటిని వారు దాటిన విధానం వంటి విషయాల గురించి ఈ సినిమాలో చర్చిస్తున్నట్టు తెలిపారు కరీనా.
![]() |
![]() |