![]() |
![]() |
షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా విడుదలైనప్పటి నుంచి సూపర్‌డూపర్ టాక్ తెచ్చుకుంది. ఎవరికి తోచినట్టు వాళ్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్ కూడా మ్యాసివ్ రెస్పాన్స్ని రికార్డ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కరణ్. "ట్రోలింగులు, బోయ్‌కాట్ అలర్ట్స్, థ్రెట్స్, ఇలాంటివేమీ మంచి సినిమాలను ఆపలేవు. గ్రేట్ సినిమా ముందు ఏవైనా తల వంచాల్సిందే. పఠాన్ సక్సెస్ ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. అతిగా ప్రమోషన్లు చేసినందువల్ల సినిమాలు ఫ్లాప్ కావు. సోషల్ మీడియాలో బోయ్‌కాట్ ట్రెండ్లు నడిస్తే సినిమా కలెక్షన్లు పడిపోవు" అని అన్నారు.
అద్భుతమైన కథ, దాన్ని అంతే గొప్పగా చెప్పే తీరు, థ్రిల్లింగ్‌గా సాగే ట్రైలర్ ఏ సినిమాకైనా బూస్ట్ ఇస్తాయి అని అన్నారు. విశాల్ శేఖర్ సంగీతం గురించి స్పెషల్‌గా మెన్షన్ చేశారు కరణ్ జోహార్. పఠాన్ మూడు రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ రూ.313కోట్లకు చేరుకుంది. మూడో రోజు కూడా 47 కోట్ల గ్రాస్ వచ్చింది ఇండియాలో. ఓవర్సీస్లో 43 కోట్ల గ్లాస్ కలెక్ట్ అయింది.
హిందీ, తమిళ్, తెలుగులో ఈ నెల 25న విడుదలైంది పఠాన్. షారుఖ్, దీపిక కలిసి నటించారు. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. ఈ సినిమాలో టైగర్ కేరక్టర్లో సల్మాన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అద్భుతమైన యాక్షన్ సీన్లు, కడుపుబ్బ నవ్వించే కామెడీ, దేశభక్తిని రేకెత్తించే సన్నివేశాలు, మంచి డైలాగులు పఠాన్‌కి ప్లస్ అయ్యాయి. దాదాపు 8000 థియేటర్లలో విడుదల చేశారు పఠాన్ సినిమాను. షారుఖ్ కమ్‌బ్యాక్ అంటున్నారు ట్రేడ్ పండిట్స్.
![]() |
![]() |