![]() |
![]() |
ఏఆర్ మురగదాస్.... దక్షిణాదిలో సుపరిచితమైన దర్శకులలో ఇతను ఒకరు. టాలెంటెడ్ డైరెక్టర్ గా ఇతనికి బ్రాండ్ నేమ్ ఉంది. ఈయన తీసిన రమణ తెలుగులో ఠాగూర్ గా వచ్చి ఘన విజయం సాధించింది. ఈ రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం నేపథ్యంలో ఈ చిత్రం ఆయనకు బాగా తోడ్పాటు ఇచ్చిందని చెప్పాలి.
ఆ తరువాత ఏరి కోరి చిరు అతనితో స్టాలిన్ అనే చిత్రం చేశారు. కానీ ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. ఇక ఈయన తీసిన గజినీ చిత్రం తమిళ్లో సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రం అపూర్వ విజయాన్ని సాధించింది. దాన్నే బాలీవుడ్ లో ఆమీర్ ఖాన్ తో కలిసి రీమేక్ చేశారు. ఈ చిత్రం అక్కడ కూడా ఘన విజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో మొట్టమొదటి సారిగా చేరింది. ఆ తరువాత ఈయన తీసిన సెవెంత్ సెన్స్ సినిమా పెద్దగా ఆడకపోయినా ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదే చిత్రం ఇప్పుడు గాని విడుదలై ఉంటే కరోనా నేపథ్యంలో ఘన విజయాన్ని సాధించి ఉండేది.
ఇక విజయ్ తో ఆయన తుపాకీ, కత్తి, సర్కార్ వంటి హిట్ చిత్రాలను తీశారు. రజినీకాంత్ తో దర్బార్ చిత్రాన్ని తెరకెక్కించారు. మహేష్ బాబుతో తెలుగు తమిళ్ లో స్పైడర్ మూవీ ని తీశారు. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. విజయ్ తో తీసిన సినిమాలన్నీ బ్రహ్మాండమైన హిట్ సాధించిన మహేష్ బాబు, రజినీకాంత్ లకు మాత్రం ఆయన పెద్దగా హిట్ ఇవ్వలేకపోయారు. ఇక ఆమీర్ ఖాన్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన లాల్ సింగ్ చద్ద చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆమీర్ ఎంతగానో కష్టపడ్డారు. సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని హైలెట్ చేస్తూ సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషల్లోనూ ప్రమోట్ చేశారు. ఇక్కడి స్టార్స్ నుంచి కూడా సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ సినిమా డిజాస్టర్ అయింది. దాంతో అతను గ్యాప్ తీసుకుని సరైన కథలు చేయాలనుకుంటున్నారు.
ప్రస్తుతం ఓ విదేశీ కథను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆమీర్ కోసం ప్రస్తుతం సౌత్ ఇండియా నుండి 100 మంది టాలెంటెడ్ దర్శకులు కథలను తీసుకొని వచ్చారట. ముఖ్యంగా ఆమీర్ ఖాన్ కు ఏ ఆర్ మురగదాస్ అంటే చాలా ఇష్టం. తుపాకీ గజినీ సినిమాలతో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపున అందుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం అపజయాలతో సతమతమవుతున్నారు. ఒకప్పుడు విజయ్ కి మంచి సక్సెస్ ఇచ్చారు. అయితే ఇప్పుడు విజయ్ కూడా అతనితో సినిమా చేయడానికి సిద్ధంగా లేరు. ఆమీర్ గతంలో మురగదాస్ దర్శకత్వంలో గజని హిందీ రీమేక్ లో చేశారు. ఆ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మళ్లీ తర్వాత మురగదాస్ ఆయనతో ఓ సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఇద్దరికీ సరైన సమయం దొరకలేదు. ఇప్పుడు ఫ్లాపుల్లో ఉండడంతో ఆమీర్ కు కొన్ని కథలను మురగదాస్ చెప్పి చర్చించినట్లు తెలుస్తోంది. అయితే వేరే సబ్జెక్ట్ ఎందుకు గజినీకి సీక్వెల్ ను రెడీ చేయమని అమీర్ సలహా ఇచ్చాడట. ప్రస్తుతం మురగదాస్ ఆ కథను రెడీ చేసే ప్రయత్నాలలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ స్పైడర్ దర్శకుడు ఫామ్ లోకి వచ్చే విధంగా గజిని 2 ని తెరకెక్కిస్తాడో లేదో చూడాలి.
![]() |
![]() |