ఇక ఉత్తరప్రదేశ్ లోనే "ఉమెన్ పవర్ లైన్" పేరుతో ఓ కేంద్రం ఉంది. 1090 దాని ఫోన్ నెంబర్. ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే చాలు అందులో పనిచేసే వ్యక్తులు మహిళల సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే స్పందిస్తారు. ఆధునిక సమాజంలో కూడా గృహహింస ఏమాత్రం తగ్గని పరిస్థితుల్లో చాలా మంది ఆడవారు ఇప్పటికే ఆ హింసను మౌనంగా భరిస్తున్నారు. చట్టరీత్యా ఏదైనా సహాయం పొందాలంటే పోలీస్ స్టేషన్, కంప్లైంట్, కోర్టు అంటూ ఇలా పెద్ద ప్రొసీజర్ ఉంది. ఇందులో ఎలా చేయాలో, ఏం చేయాలో కూడా తెలియక చాలా మంది ఆ ప్రయత్నమే చేయరు.
అదే 1090కి ఫోన్ చేస్తే చాలు. శాంతియుత పద్ధతిలో సమస్యలను పరిష్కరిస్తారు. ఇక్కడ సిబ్బంది తెలివిగా, మానవీయ కోణంలో కేసులను పరిష్కరించటమే వీరి ప్రత్యేకత. ఇలాంటి కేంద్రాలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తే చాలు మహిళల పట్ల జరిగే హింస తగ్గిపోతుంది అంటున్నారు అక్కడి ప్రజలు. లక్షల మందికి పైగా దీనిద్వారా సహాయం పొందటమే వీరి నమ్మకానికి కారణం.