Home » Articles » దీపావళికి ఇలా చేయాలి ...

దీపావళికి ఇలా చేయాలి ...

 

How to Celebrate Diwali, deepavali celeration 2013, diwali pooja, diwali lakshmi pooja, goddess lakshmi names,

 

* దీపావళి నాడు యముడు  దక్షిణ దిశగా ఉంటాడు కాబట్టి మగ పిల్లలు ఆ దిశగా  నిలబడి దివిటీలు వెలిగించి పితృదేవతలకు దారి చూపాలి. ఆ తర్వాత తీపి  పదార్ధాలు తిని, దీపాలు వెలిగించి లక్ష్మీ దేవిని ఆవాహనం చేసి,పూజించాలి.ఆ తర్వాత టపాసులు కాల్చుకోవాలి.

*
దీపావళికి దీపాలు వెలిగించేటపుడు ఒక్కో దీపాన్ని మన పూర్వీకులలో ఒకొక్కరి పేరున వెలిగించాలని చెబుతోంది శాస్త్రం. పితృదేవతలని తలచుకుని ఎందరుంటే అన్ని దీపాలు వెలిగించాలి.

*
దీపావళి రోజున వెలిగించిన దీపాలనే లక్ష్మీదేవికి ప్రతీకలుగా భావించి పూజిస్తారు. దీపాలకు పసుపు, కుంకుమ పెట్టి, అక్షింతలు వేసి, పూలతో లక్ష్మీ అష్టోత్తర నామాలతో పూజిస్తారు.

*
గుమ్మం దగ్గర, ఇంటి ముందు దీపాలను పెట్టే చోట ముందుగా పూలు, అక్షింతలు వేసి ఆ పైన దీపాలు పెట్టాలి.

*
నరక చతుర్దశి రోజున నూనెలో లక్ష్మీదేవి, నీళ్ళలో గంగాదేవి ఉంటారు. అందుకే నరక చతుర్దశి రోజున నూనె రాసుకుని అభ్యంగన స్నానం చెయ్యాలి.

*
కొన్ని ప్రాంతాలలో నరక చతుర్దశి రోజున ఇంటి ముందు యజమానికి దిష్టి తీసి హారతులు ఇచ్చే ఆచారం కూడా ఉంది.

*
ఇక చతుర్దశి నాడు పితృతర్పణాదులు చేసి దీపాలు వెలిగించాలి. నరకంలో ఉన్న వారికి ఈ దీపాలు స్వర్గానికి దారి చూపుతాయని నమ్మకం.

 

 

How to Celebrate Diwali, deepavali celeration 2013, diwali pooja, diwali lakshmi pooja, goddess lakshmi names,

 


*
లక్ష్మీ దేవిని :
శ్రీదేవి
అమృతోద్భవ
కమలాక్షి
లోకసుందరి
విష్ణుపత్ని
శ్రీవైష్ణవి
వారాహి
హరివల్లభ
నారసింహ
దేవదేవతా
మహాలక్ష్మీ
భువనేశ్వరీ
అనే నామలతో ప్రార్ధిస్తే పాపాలన్నీ హరించబడి, దుఃఖాలన్నీ తొలగిపోయి సర్వసంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి.