నైవేద్యం - పాయసం
కావలసినవి:
బియ్యం - రెండు కప్పులు
పాలు - నాలుగు కప్పులు
పంచదార - మూడు కప్పులు
ఇలాచి పొడి చిటికెడు
జీడిపప్పు 10
కిస్మిస్ 10
తయారీ :
ముందుగా రెండు కప్పుల పాలు గిన్నెలోకి తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. బాగా మరిగిన తరువాత అందులో కడిగిన బియ్యం వేసి అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ వుండాలి. అన్నం ఉడికాక మిగిలిన పాలు వేసి 10 నిముషాలు మరిగించాలి తరువాత పంచదార, ఇలాచి పొడి వేసి కలపాలి. ఇప్పుడు పక్క స్టవ్ మీద గిన్నె పెట్టి నెయ్యి వేసి అది వేడయ్యాక అందులో జీడిపప్పు,కిస్మిస్ వేయించి పాయసంలో వేసి కలపాలి..