Home » Vegetarian » Dum Aloo Recipe


 

 

దమ్ ఆలూ కరీ  

 

 

 

కావలసినవి:
ఆలు చిన్నవి - పావుకేజీ 
టమాటలు - మూడు 
ఉల్లిపాయలు - నాలుగు 
అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను 
పసుపు , ఉప్పు - తగినంత 
నూనె - ఒక పెద్ద కప్పుతో 
పెరుగు - ఒక చిన్న కప్పుతో 
గరంమసాలా - ఒక స్పూను 
కొత్తిమీర - తగినంత
కారం - రెండు స్పూనులు 
ధనియాలపొడి - ఒక స్పూను 

 

తయారు చేసే విధానము:
ముందుగా చిన్న బంగాళదుంపలని కుక్కర్ లో ఉడికించి చెక్కుతీసి పెట్టుకోవాలి. ఆ సమయంలోనే టమాటను నీళ్ళల్లో ఉడికించాలి. ఉల్లిపాయలని సన్నగా తరిగి వేయించాలి. ఆ తర్వాత చల్లారాకా టమాట చెక్కుతీసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అలాగే ఉల్లిపాయలని కూడా మెత్తగా గ్రైండ్ చేయాలి. రెండు చెమ్చాల  నూనె  వేసి కాగాకా ముందుగా ఉల్లిముద్ద, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఆ మిశ్రమం కొంచం ఎర్ర రంగుకి వస్తుండగా, పసుపు, కారం, ధనియాల పొడి, గరంమసాలా,  ఉప్పు వేసి కలపాలి.ఆ తరువాత టమాట గుజ్జు, పెరుగు, చిన్న గ్లాసు నీళ్ళు పోసి ఉడకనివ్వాలి. గ్రేవీ ఉడుకుపట్టాకా ముందుగా ఉడికించి పెట్టుకున్న చిన్న ఆలులని డీప్ ఫ్రై చేసి ..చల్లారాక టమాట ,ఉల్లి  గ్రేవీ లో  వేసి ఓ పదిహేను నిమిషాలు మగ్గించాలి. దించేముందు కొత్తిమీర వేస్తే దమ్ ఆలూ కరీ సిద్ధం.  

 

-రమ  

 


Related Recipes

Vegetarian

ఆలు బొండా!

Vegetarian

ఆలు దమ్ బిర్యానీ

Vegetarian

ఆలు వంకాయ ఫ్రై!

Vegetarian

ఆలూ 65

Vegetarian

పెరుగు బెండకాయ మసాలా కర్రీ

Vegetarian

మస్త్ మస్త్ మలై పన్నీర్ కర్రీ

Vegetarian

బేబీ పొటాటో మంచూరియా..!!

Vegetarian

పొటాటో-కాలిఫ్లవర్ కబాబ్