Home » Vegetarian » వెజిటబుల్ పరాఠా!
వెజిటబుల్ పరాఠా!
కావలసిన పదార్థాలు:
గోధుమపిండి : 1 కప్పు
బంగాళాదుంప : 1
క్యారెట్ ముక్కలు : అరకప్పు
కాలీఫ్లవర్ ముక్కలు : పావుకప్పు
పచ్చి బఠాణీ : పావుకప్పు
సన్నగా తరిగిన పాలకూర : పావుకప్పు
కొత్తిమీర : పావుకప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ : అరచెంచా
కారం : అరచెంచా
గరం మసాలా : అరచెంచా
వాము : అరచెంచా
ఉప్పు : తగినంత
నూనె లేక నెయ్యి : కాల్చుకోడానికి సరిపడా
తయారీ విధానం:
గోధుమపిండిలో నీళ్లు వేసి చపాతీపిండి మాదిరిగా కలిపి, ఓ అరగంట పాటు అలా వదిలేయాలి. ఈలోపు బంగాళాదుంపను ఉడికించి, తొక్క తీసి, మెత్తగా చిదుముకోవాలి. మిగతా కూరగాయలన్నికీ నీటిలో వేసి మెత్తబడేవరకూ ఉడికించాలి. తర్వాత వాటన్నిటికీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బంగాళాదుంప, కూరగాయల ముద్దలో నూనె/నెయ్యి తప్ప మిగతా పదార్థాలన్నిటినీ వేసి కలపాలి. గోధుమపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీల మాదిరిగా ఒత్తుకోవాలి. దీని మధ్యలో పై మిశ్రమాన్ని పెట్టి, అన్ని వైపుల నుంచీ మూసివేసి, మళ్లీ ఉండ చుట్టాలి. దీన్ని మళ్లీ ఒత్తుకుని నూనె లేక నెయ్యి వేసి కాల్చుకోవాలి.
- Sameera