Home » Vegetarian » Gobhi Paratha
గోబీ పరోటా
కావలసిన పదార్థాలు :
కాలీఫ్లవర్ పువ్వు - 1
ఉల్లిపాయి - 1
పచ్చిమిర్చి - 2
వాము - కొద్దిగా
ఉప్పు - 1/2 చెంచా
కారం - 1/2 చెంచా
కొత్తిమీర తరుగు - 2 చెంచాలు
నూనె - 1/4 కప్పు
చపాతీపిండి - 1 కప్పు
తయారుచేసే విధానము:
* ముందుగా చపాతీపిండిలో చిటికెడు ఉప్పు వేసి మెత్తగా కలుపుకుని నాననివ్వాలి.
* కాలీఫ్లవర్‌ను మొగ్గలుగా కట్‌చేసి శుభ్రం చేసుకుని ఫుడ్‌ప్రోసెసర్‌లోగాని.. గ్రేటర్‌లో గాని సన్నగా తరగాలి.
* ఉల్లిపాయి కూడా చాలా చిన్న ముక్కలు తరుగు కోవాలి. అందులో పచ్చిమిర్చి, ఉప్పు, కారం, వాము, కొత్తిమీర వేసి గోబి మిశ్రమం సిద్ధం చేసుకోవాలి.
* ఇప్పుడు చపాతీ పిండిని ఉండగా చేసి చిన్న పూరీ మాదిరి ఒత్తుకుని అందులో ఈ గోబి మిశ్రమం వేసి చుట్టూ చేతితో కలుపుతూ మూటలా చేసి రెండు అరచేతుల మధ్య బిళ్ళలా నొక్కాలి.
* మళ్ళీ పొడి పిండి అద్ది మెల్లగా అప్పడాల కర్రను తేలిగ్గా ఆన్చుతూ పరోటాలు చేసుకుని పెనంపై దోరగా కాల్చి తియ్యాలి.
* ఈ గోబీ పరోటాలను పుదీనా చట్నీ (లేక) సాస్‌తో తినవచ్చును. ఎంతో రుచిగా ఉంటాయి.