Home » Vegetarian » Kaju Mushroom Masala Recipe
కాజూ మష్రూమ్ మసాలా
కావాల్సిన పదార్ధాలు:
టొమాటోలు - మూడు
అల్లం - చిన్న ముక్క
జీడిపప్పు (15 mins నానబెట్టినది) - పావు కప్పు
పచ్చిమిర్చి - మూడు
వెల్లూలి - నాలుగు
యాలుకలు - రెండు
లవంగాలు - మూడు
ఎండు మిర్చి - రెండు
మిరియాలు - అర టేబుల్ స్పూన్
మీగడ పెరుగు - పావు కప్పు
నీళ్ళు - తగినన్ని
కూర కోసం:
నూనె - అర కప్పు
జీడిపప్పు - ముప్పావు కప్పు
మష్రూమ్స్ - 150 gms
ఉల్లిపాయ - ఒకటి
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్
కారం - అర టేబుల్ స్పూన్
గరం మసాలా - అర టేబుల్ స్పూన్
ధనియాల పొడి - అర టేబుల్ స్పూన్
కారం - రెండు టేబుల్ స్పూన్స్
ఉప్పు - తగినంత
నీళ్ళు - 350 ml
నెయ్యి -ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర తరుగు - కొద్దిగా
నిమ్మరసం - అర టేబుల్ స్పూన్
తయారీ విధానం:
* గ్రేవీ కోసం ఉంచిన పదార్ధాలన్నీ మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి.
* నూనెలో జీడిపప్పు వేసి సగం వేపుకుని అందులోనే మష్రూమ్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుని తీసి పక్కన పెట్టుకోవాలి.
* అదే నూనెలో జీలకర్ర, ఉల్లిపాయ తరుగు వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపాలి. వేగిన ఉల్లిపాయల్లో కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా వేపుకోవాలి. అవి వేగాక రెఢీగా ఉన్న పేస్టు వేసి 3-4 నిమిషాలు ఉడకనిచ్చి అందులో, 350 ml నీళ్ళు పోసి గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలే వరకు మగ్గనివ్వాలి .
* ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి.
* నూనె తేలాక ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్ప్పు, మష్రూమ్స్ వేసి 5 నిమిషాలు ఉడకనిచ్చి.... తర్వాత నెయ్యి, కొత్తిమీర తరుగు చల్లి మరో నిమిషం ఉడకనివ్వాలి.
* దింపే ముందు నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇది రైస్ లోకి, చపాతీ లోకి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.