Home » Rice » Rice and Fruit Salad
రైస్ & ఫ్రూట్ సలాడ్
కావలసిన పదార్దాములు:
బిర్యానీ రైస్ - 100 గ్రాములు
పైనాపిల్ పీసెస్ - 1 కప్పు ( సన్నగా కట్ చేసినవి )
కీరదోస పీసెస్ - 1 2 కప్పు ( సన్నగా కట్ చేసినవి )
బాదంపప్పు, జీడిపప్పు - 50 గ్రా ( సన్నవి ముక్కలు చేసి వేసినవి )
ఉప్పు - రుచికి సరిపడ
పెప్పర్ - రుచికి సరిపడ
డ్రేస్సింగ్ కి :
కమలారసం - అర కప్పు
వెజిటబుల్ ఆయిల్ - 1 4 కప్పు
ధనియాలపొడి - 1 స్పూన్
కారం - 1 స్పూన్
తయారుచేయు విధానం:
ముందుగా బియ్యం శుభ్రంగా కడగాలి. ఉప్పు వేసి మరిగించి నీటిలో బియ్యం, యాలుకలు వేసి ఉడికించాలి.
బియ్యం ఉడకగానే గంజి వార్చి అన్నం మీద చల్లని నీరు పోయాలి. ఈ విధంగా చేయటం వలన అన్నం పొడిగా ఉండి విడివిడిగా ఉంటుంది.
ఒక బౌల్ లో పైనాపిల్, కీరదోస ముక్కలు, జీడిపప్పు, బాదంపప్పు, సరిపడ ఉప్పు, పెప్పర్, కమలారసం, ఆయిల్, ధనియాలపొడి, కారం వేసి కలపాలి.
ఈ మిశ్రమాన్ని అన్నానికి జత చేసి బాగా కలిసేలా కలపాలి. సర్వ్ చేసే ముందు ప్లేట్స్ లో పెట్టి పైన కొత్తిమీర చల్లి సర్వ్ చెయ్యాలి. ఈ సలాడ్ కనీసం 4 గురికి సర్వ్ చేయవచ్చు.