Home » Others » మసాలా వడ
మసాలా వడ
కావాల్సిన పదార్ధాలు:
మినపప్పు - పావు కప్పు
పచ్చి సెనగపప్పు - పావు కప్పు
కంది పప్పు - పావు కప్పు
సోంపు - ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్
అల్లం - కొద్దిగా
వెల్లులి - 7 రెబ్బలు
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - నాలుగు
కొత్తిమీర తరుగు - కొద్దిగా
ఎండుమిర్చి - రెండు
కరివేపాకు - రెండు రెబ్బలు
ఉల్లిపాయ తరుగు - ఒకటి
పుదీనా తరుగు - కొద్దిగా
నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
*మినపప్పు,సెనగపప్పు, కందిపప్పుని 3-4 గంటలు నానబెట్టుకోవాలి.
*నాలుగు గంటలు నానబెట్టిన పప్పుని జల్లెడలో వేసి పూర్తిగా వడకట్టి రెండు నిమిషాలు వదిలేయాలి.
*మిక్సీ జార్ లో సోంపు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లులి, ఎండుమిర్చి, నానబెట్టిన పప్పు వేసి నీరు వేయకుండా పలుకుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి.
*ఒక గిన్నెలోకి బరకగా రుబ్బుకున్న పప్పు, ఉల్లిపాయ తరుగు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసి గట్టిగా కలుపుకోవాలి.
*చేతులు తడి చేసుకుని కలిపిన పిండిని తీసుకుని చేత్తో తట్టి మరిగే వేడి నూనెలో వేసి కదపకుండా వదిలేయాలి మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. మూడు నాలుగు నిమిషాల తరువాత నెమ్మదిగా గరిటతో తిప్పుతూ మీడియం ఫ్లేమ్ మీదే ఎర్రగా వేగనివ్వాలి.
*ఎర్రగా వేగిన వడని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ మూడు పప్పుల మసాలా వడ వేడి మీద చాలా క్రిస్పీగా ఉంటాయి.