Home » Others » Dahi Vada (Ugadi Special)
దహి వడ (ఉగాది స్పెషల్)
కావలసినవి :-
పెసరపప్పు - 1కప్పు
మినపప్పు - 1కప్పు
పెరుగు -1/2 లీటరు
నూనె - వేయించడానికి సరిపడ
ఉప్పు - కొద్దిగా
తయారీ విధానం :-
పెసర, మినప పప్పులను కలిపి కడిగి 3గంటలు నానబెట్టాలి. మెత్తగా కాస్త గట్టిగా రుబ్బుకోవాలి. కాస్త ఉప్పు కలిపి బాగా చెంచాతో ఒకే దిశలో బాగా కలపాలి. నురగ తేలి పిండితేలిక పడుతుంది. ఈ పిండిని ఉండలుగా కాగే నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుని ప్రక్కన పెట్టుకోవాలి.
దహి వడ చట్నీలు :-
* కొత్తిమీర, పుదీనా, మిరపముక్కలు, అల్లం, జీలకర్ర, ఉప్పు కలిపి పుదీనా చట్నీ రుబ్బుకోవాలి.
తీపి చట్నీ:-
* చింతపండు రసం, బెల్లం, ఉప్పు, కారం, కిస్ మిస్ లు బాగా ఉడికించి తీపి చట్నీ తయారుచేసుకోవాలి.
దహి వడలు (పునుగులు) గోరు వెచ్చని నీటిలో 10ని " తినేముందు వేసి చేతిలో ఒక్కసారి నీరు పోయేలా నొక్కి ఒక బౌల్ లో వేసుకోవాలి. పెరుగును గిలకొట్టి పైన పోసి, ఆపైన పుదీనా చట్నీ, తీపి చట్నీవేసి జీలకర్ర పొడి కొత్తిమీరతో అలంకరించాలి. దీనిని చల్లగా సర్వ్ చేస్తే బావుంటుంది. https://www.youtube.com/watch?v=PZwaNjjOAVo