Home » Sweets N Deserts » Custard Barfi
కస్టర్డ్ బర్ఫీ
కావలసిన పదార్థాలు
కస్టర్డ్ పౌడర్ - 1 కప్పు
పంచదార - 1 కప్పు
ఏవైనా డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు
నెయ్యి - 2 స్పూన్స్
నిమ్మకాయ - 1 చెక్క
ఫ్రూట్ ఎస్సెన్స్ - 4 చుక్కలు
తయారీ విధానం
1.ఒక బౌలులో కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా ఒక గ్లాసు నీటితో జారుగా కలుపుకోవాలి.
2.స్టవ్ వెలిగించి, కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసి, డ్రైఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి.
3.అదే కడాయిలో పంచదార వేసి, ఒక అరగ్లాసు నీళ్ళు పోసి, కరిగే వరకు స్టవ్ సిమ్ లో పెట్టి కదుపుతూ ఉండాలి.
4.పంచదార మొత్తం కరిగాక, ముందుగా సిద్దం చేసి ఉంచుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని పోసి, ఉండలు కట్టకుండా కదుపుతూ ఉండాలి.
5.బర్ఫీ దగ్గర పడి కడాయిని విడచి ముద్దగా తయారయ్యాక, స్టవ్ మీద నుండి దించే ముందు 1 స్పూన్ నెయ్యి వేసి, ముందుగా గ్రీజ్ చేసి పెట్టుకున్న ప్లేటులోకి ఈ బర్ఫీని వెయ్యాలి.
6.డ్రై ఫ్రూట్స్ లో 4 చుక్కల ఎస్సెన్స్ కలిపి వాటిని బర్ఫీ పై అద్దుకోవాలి. బర్ఫీని మనకి నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోసుకునే ముందు, దానిపై నిమ్మరసం పిండాలి. కొంచెం పుల్లగా, కొంచెం తియ్యగా ఎంతో రుచికరంగా ఉండే బర్ఫీ మన ముందు రడీగా ఉంటుంది.
- కళ్యాణి