Home » Sweets N Deserts » క్యారెట్ హల్వా
క్యారెట్ హల్వా
కావాల్సిన పదార్థాలు:
క్యారట్ తురుము -కప్పు
వెన్నతో కూడిన పాలు - కప్పు
బెల్లం తురుము - పావు కప్పు
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు, పిస్తా, కిస్ మిస్,
బాదం పప్పులు - గుప్పెడన్ని
యాలకుల పొడి - 1 టీస్పూన్
తయారీ విధానం:
ముందుగా స్టౌ వెలిగించుకుని ప్యాన్ పెట్టాలి.
అందులో నెయ్యి వేసి కరిగించుకోవాలి. ఇందులో క్యారెట్ తురుము వేసి పచ్చిదనం పోయేంతవరకు వేయించాలి.
తర్వాత అందులో పాలు పోసి మరగనివ్వాలి.
ఈ క్రమంలో మిశ్రమం అడుగు అంటకుండా జాగ్రత్తగా కలుపుతుండాలి.
కాస్త దగ్గరపడుతున్న సమయంలో బెల్లం పొండి వేసి బాగా కలపాలి.
బెల్లం కరిగి మిశ్రమం చిక్కబడే వరకు కలుపుతుండాలి. తర్వాత ఇందులో యాలకుల పొడి, డ్రైఫ్రూట్ వేసి కలపాలి. 5 నిమిషాల తర్వాత కాస్త నెయ్యి వేసి ఒకసారి కలపాలి. దింపే ముందు యాలకుల పొడి వేసుకుంటే హెల్దీ టేస్టీ క్యారెట్ హల్వా సిద్ధం.
నోట్:
చక్కెరకు బదులు బెల్లం ఉపయోగించుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
క్యారెట్స్ క్యాన్సర్ ముప్పు తగ్గించేందుకు దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్లలో ఉండే అన్ని రకాల ఫైటో కెమికల్సే దీని కారణమని చెబుతున్నారు.
వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలో క్యాన్సర్ కలిగించే ఫ్రీ రాడికల్స్ ను విచ్చిన్నం చేస్తుంది.
దీంతో ట్యూమర్లు ఏర్పకుండా అడ్డుకుంటుంది.
తద్వారా క్యాన్సర్ ముప్పుకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.