Home » Sweets N Deserts » Curd Cake
పెరుగు కేక్
కావలసిన పదార్ధాలు :
* మైదాపిండి - 2 కప్పులు
* పంచదార - 2 కప్పులు
* ఎండు ద్రాక్షలు - తగినంత
* వెనిలా ఎసెన్స్ - 1 స్పూన్
* క్రీమ్ కోసం పాలు - 5 స్పూన్
* పాలు - అరకప్పు
* వెన్న - అరకప్పు
* బేకింగ్ సోడా - చిటికెడు
* నూనె - 5 స్పూన్
* జీడిపప్పు - తగినంత
* స్ట్రాబెరి - గార్నిష్
తయారీ విధానం:
ముందుగా ఒక బాణలి తీసుకొని అందులో మైదా పిండి వేసి నూనె లేకుండా వేయించుకోవాలి. తరువాత మరో గిన్నెలో పెరుగు తీసుకొని దానిలో పంచదార వేసి బాగా గిలకొట్టాలి. ఇలా గిలకొట్టిన పెరుగులో బేకింగ్ సోడా, కొంచెం పాలు పోసి బాగా కలిపి పక్కన పెట్టాలి. దానిని ఓ 10 నిముషాలు అలా ఉంచి ఆ తర్వాత వెనిలా ఎసేన్స్ చేర్చాలి. ఇప్పుడు మిశ్రమంలో ముందుగా వేయించి పెట్టుకున్న మైదాపిండిని వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. అలా క్రీమ్ లా తయారైన ఈ మిశ్రమంలో ఎండు ద్రాక్ష, జీడిపప్పు వేసి కేక్ మోల్డ్ లో వేసుకొని ఓవెన్ లో బేక్ చేయాలి. అరగంటయ్యాక తీయాలి.
క్రీమ్ తయారీ విధానం :- వెన్నలో పంచదార, పాలు, వెనిలా ఎసేన్స్ చేర్చి బీటర్ తో బీట్ చేయాలి. ఒకవేళ క్రీమ్ గట్టిగా అయినట్టు అనిపిస్తే అందులో కొంచెం పాలు చేర్చాలి. ఇప్పుడు ఈ క్రీమ్ ను కేక్ మీద పరిచి స్ట్రాబెరితో అలంకరించుకొంటే సరిపోతుంది. అంతే ఆరోగ్యానికి ఎంతో మంచిదైన టేస్టీ పెరుగు కేక్ రెడీ అయినట్టే.