Home » Vegetarian » Cauliflower Tomato Palakura Curry
కాలీఫ్లవర్ టమాటా పాలకూర కర్రీ
కావలసిన పదార్ధాలు:
కాలీఫ్లవర్ మొగ్గలు - 1 కప్పు
టమాటా - 1/2 కప్పు
పాలకూర కట్టలు - 2
ఉల్లి ముక్కలు - 1/4 కప్పు
పచ్చిమిరపముక్కలు - 4
ఆమ్ చూర్ - 1/4 చెంచా
ధనియాల పొడి - 1/4 చెంచా
గరం మసాలా - 1/4 చెంచా
కారం - 1/4 చెంచా
జీలకర్ర - కొద్దిగా
పసుపు - కొద్దిగా
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడినంత
తయారీ విధానం:
* కాలీఫ్లవర్ మొగ్గలుగా తరుగుకొని కొద్ది పాలు కలిపిననీళ్ళలో ఉడికించి... వడగట్టి ప్రక్కన పెట్టుకోవాలి. అలా చేస్తే మొగ్గలు తెల్లగా ఉంటాయి.
* బాణలిలో నూనె వేసి వేడి చేసి కాస్త దంచిన వెల్లుల్లి జీలకర్ర వేయించి ఒక్కొక్కటిగా ఉల్లి ముక్కలు, పచ్చి మిర్చి, టమాటా వేసి వేయించుకోవాలి.
* ఈ ముక్కలు దోరగావేగుతున్నప్పుడు ఉప్పు, కారం, గరంమసాల, ఆమ్ చూర్ పొడి వేసి కాలీఫ్లవర్ మొగ్గలు వేసి బాగా కలిపి సన్నగా తరిగిన పాలకూర ఆకులు వేసి మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించి దింపుకోవాలి.
* ఒళ్ళు తగ్గాలనే వారికి ఈ కూర చాలా మంచిది. ఆలుగడ్డ ఉండదు.
* పిల్లలకు లంచ్ బాక్స్ లో ఇచ్చేవారు.... కాలీఫ్లవర్ తో పాటు ఆల్లుగడ్డ ఉడికించుకోవాలి.
* ఈ కూర చూడడానికి తెలుపు, ఎరుపు, ఆకుపచ్చరంగులు కలిపి రుచితోపాటు కంటికి ఇంపుగా ఉంటుంది.
* దీనిని చపాతీ పూరీలతో తింటే బాగుంటుంది. పొడి కూర కాబట్టి బ్రెడ్ మద్యలో పెట్టుకుని కూడా తినవచ్చు.. చాలా బావుంటుంది.