Home » Vegetarian » పొటాటో-కాలిఫ్లవర్ కబాబ్
పొటాటో-కాలిఫ్లవర్ కబాబ్
మీరు ఎప్పుడైనా బంగాళదుంప, కాలిఫ్లవర్ కబాబ్స్ తిన్నారా? అయితే ఖచ్చితంగా ఈ కొత్తవంటకాన్ని ఓసారి ప్రయత్నించండి.
కావాల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు- 2 పెద్ద సైజువి
కాలీఫ్లవర్ - 1
జీలకర్ర- 1టీస్పూన్
పసుపు- అరటీస్పూన్
ఎర్రకారం-1టీస్పూన్
చాట్ మసాలా- 1టీస్పూన్
కొత్తిమీర తరగులు
శనగపిండి- అరకప్పు
తయారు విధానం:
కాలీఫ్లవర్ నుంచి పుష్పాలను వేరు చేసి శుభ్రంగా కడగాలి. బంగాళదుంపల తొక్కలు తీసి వాటిని ఉడకబెట్టాలి. ఇప్పుడు మిక్సర్ గ్రైండర్ లో కాలీఫ్లవర్ పువ్వులు, జీలకర్ర, పసుపు, ఎర్రకారం, చాట్ మసాలా వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు, కొత్తిమీర తరుగు, అరకప్పు వేయించిన శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకుని కబాబ్స్ మాదిరి చేసుకోవాలి. ఇప్పుడు స్టౌ పై ప్యాన్ పెట్టి..వేడి చేసుకోవాలి. తర్వాత కబాబ్ టిక్కిని ఉంచి రెండు వైపులా కాల్పుకోవాలి. వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పచ్చి చట్నీ, ఉల్లిపాయలు, చపాతీ లేదా రోటీలతో కబాబ్ లు తింటే రుచి భలే ఉంటుంది. డిన్నర్ లోనే కాకుండా టీతోపాటు స్నాక్స్ గా కబాబ్ లను తినవచ్చు.