Home » Sweets N Deserts » Boondi Laddu (Sankranthi Special)
బూందీ లడ్డు (సంక్రాంతి స్పెషల్)
స్వీట్లంటే మనకు ముందు గుర్తొచ్చేది లడ్డూనే కదా. ఇక సంక్రాంతి పండుగ కూడా వచ్చేస్తుంది మరి ఈ పండుగకు రకరకాల పిండి వంటలు చేసుకుంటారు. ఇక స్వీట్ గా ఈ లడ్డూ కూడా తయారు చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియో చూసి బూందీ లడ్డూ ఎలా తయారుచేసుకుంటారో చూద్దాం..
https://www.youtube.com/watch?v=bGf7mp6s6c4
కావలసిన పదార్థాలు:
శెనగ పిండి - 1 గ్లాసు
పంచదార - 1 గ్లాసు
ఇలాచీ పొడి - 1 / 2 స్పూన్
వేయించడానికి 1 / 2 కేజీ నూనె
కాజు, కిస్ మిస్ - పావుకప్పు
తయారీవిధానం:-
ముందుగా తాజాగా శెనగ పిండిని నీళ్లలో బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా జారుగా కలుపుకోవాలి. స్టవ్ మీద ప్రక్క పొయ్యి పై దళసరి గిన్నెలో పంచదార పోసి ఒకగ్లాసు నీరుపోసి తీగపాకం రాగానే.. మంట తగ్గించి స్టవ్ ఆఫ్ చేసి దానిలో ఇలాచీ పొడి జల్లాలి...
పెద్ద బర్నర్ గల పొయ్యి పై బాణలిలో నూనె పోసి.. కాగాక .... బూందీ పిండిని మిఠాయి చట్రంలో ఒక గరిటెకు పోసి అంచుపై కొడితే పూసగా బూందీ నూనెలోకి రాలుతుంది, వేగడానికి తక్కువ సమయమే పడుతుంది. మరో చిల్లుల చట్నంతో ఆ బూందీని తీసి పాకంలో వెయ్యాలి. మళ్ళీమరో గరిటెడు పిండిని బూందీ చట్రంతో పోసి కదపాలి. జారిన బూందీ గలగల మని వేగాక తీసి పాకంలో వెయ్యాలి. చట్నం అడుగు మధ్య మధ్యలో శుభ్రం చేసుకోవాలి. లేకపోతే బూందీ గుండ్రంగా కాక పిలకల లాగావస్తుది. పిండి అంతా బూందీగా చేసాక... ఒక పళ్లెంలో పాకం బూందీ కలిపి వెంటనే ఉండలు చుట్టాలి .. పాకం ముదిరినా, చల్లారినా, బూందీ విడిపోతుంది. జాగ్రత్తగా ఆ పాకం చల్లారకుండా బూందీ కలుపుకోవాలి. చాలా సులభంగా బోలెడు బూందీ లడ్డులు తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా వుంటాయి.