Home » Sweets N Deserts » Rava Laddu
రవ్వ లడ్డు
కావాల్సిన పదార్ధాలు:
బొంబాయి రవ్వ - పావు కేజీ
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
నెయ్యి - మూడు టేబుల్ స్పూన్స్
జీడి పప్పు - కొద్దిగా
ఎండు ద్రాక్ష - కొద్దిగా
పంచదార - ఒక కప్పు
నీళ్ళు - 100 ml
యాలుకులు - నాలుగు
తయారీ విధానం:
* రవ్వను పచ్చి కొబ్బరిలో బాగా మిక్స్ చేసి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
* యాలుకులును కూడా మెత్తగా పొడి చేసుకోవాలి.
* కళాయిలో నెయ్యి వేసి అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
* ఇప్పుడు రెండు గంటలు పాటు మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని సన్నని మంట మీద గోల్డెన్ కలర్ వచ్చే దాక వేపుకోవాలి.
* మరో బాండిలో పంచదార వేసి అందులో కొద్దిగా నీళ్ళు పోసి తీగ పాకం వచ్చేదాకా మరిగించాలి.
* తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి వేయించుకున్న రవ్వ, జీడిపప్పు,ఎండు ద్రాక్ష, యాలకుల పొడి వేసి బాగా కలిపి వేడిగా వున్న మిశ్రమాన్ని గోరువెచ్చగా అయ్యేవరకు చల్లారనివ్వాలి.
* తర్వాత చేతికి నెయ్యి రాసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి. లేదంటే పొడి పొడిగా అయిపోయి లడ్డు చేయడానికి రాదు.
* లడ్డూలు చుట్టాక వాటిని బాగా చల్లారనిచ్చి గాలిపోకుండా వుండే డబ్బాలో పెడితే కనీసం వారం పాటు ఈ లడ్డులు ఫ్రెష్ గా ఉంటాయి.