Home » Sweets N Deserts » మోతీచూర్ లడ్డూ
మోతీచూర్ లడ్డూ
కావాల్సిన పదార్థాలు:
శనగపిండి- పావు కిలో
ఆరెంజ్ ఫుడ్ కలర్ - చిటికెడు
నీళ్లు- పావు లీటర్
నూనె-డీఫ్రైకు సరిపడే విధంగా
చక్కెర -400గ్రాములు,
యాలకుల పొండి-1 టీస్పూన్
వేయించిన జీడిపప్పు-కొద్దిగా
నెయ్యి-3 టీ స్పూన్స్
నిమ్మరసం -1 టీ స్పూన్
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. అందులో ఫుడ్ కలర్ వేసి కలపాలి. తర్వాత నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపుపోవాలి. తర్వాత ఒక బాణాలి తీసుకుని నూనె పోసీ వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక మోతిచూర్ లడ్డును తయారు చేసుకోవడానికి కావాల్సిన చిల్లుల గంటెను తీసుకోవాలి. అందులో ఒక దగ్గర పిండిని వేస్తూ చేత్తతో కలపాలి. ఆ తర్వాత ఈ బూందీని పెద్ద మంటపై ఎర్రగా అయ్యేవరకు కాల్చుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
ఇలా బూందీని తయారు చేసిన తర్వాత బాణాలిలో చక్కెరను 300ఎంఎల్ నీటి పోయాలి. వీటిని వేడి చేయాలి. పంచదార కరిగి తీగ పాకం వచ్చిన తర్వాత అందులో నిమ్మరసం, కొద్దిగా ఫుడ్ కలర్ వేయాలి. తర్వాత బూందీని వేసి బూందీ పంచదార మిశ్రమం అంతా కలిసేవిధంగా కలపాలి. బూందీ చక్కెర మిశ్రమాన్ని పీల్చుకుని దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత దీనిపై టిష్యూ పేపర్లను ఉంచి మూత పెట్టి గోరు వెచ్చగా అయ్యేవరకు అందులో ఉంచాలి.
తర్వాత అందులో యాలకుల పొడి, జీడిపప్పు, నెయ్యి వేసి కలపాలి. చేతిని నెయ్యి రాసుకుంటూ మీకు నచ్చిన పరిమాణంలో బూందీ మిశ్రమాన్ని తీసుకుని లడ్డూల్లా చేసుకోవాలి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవచ్చు. దాదాపు 15 నుంచి 20 రోజుల వరకు తాజాగా ఉంటాయి.