స్వీట్ మ్యాంగో చట్నీ

 

 

 

 

కావలసిన పదార్థాలు:

మామిడిపండ్లు                                   - రెండు
పచ్చికొబ్బరి తురుము                        - ఒక కప్పు
ఎండుమిర్చి                                        - మూడు
వెల్లుల్లి రేకులు                                    - రెండు
చింతపండు                                        - కొద్దిగా
ఉప్పు                                                - చిటికెడు
బెల్లం                                                 - చిన్నముక్క

 

తయారీ విధానం:

మామిడిపండ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లి, బెల్లం, చింతపండు కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు చేర్చుకోవాలి. ఈ పేస్ట్ ని ఓ బౌల్ లో తీసుకుని, ఇందులో మామిడి ముక్కలు వేసి బాగా కలపాలి (కావాలంటే తురుము కూడా వేసుకోవచ్చు). ఇది ఇడ్లీల్లోకి, దోశల్లోకి బావుంటుంది. తీపి ఎక్కువ తెలియకూడదనుకుంటే ఎండుమిర్చి కాస్త ఎక్కువ వేసుకుంటే సరి. అలాగే ఆవాలు, జీలకర్ర, శనగపప్పుతో తాలింపు వేసుకుంటే కూడా రుచి పెరుగుతుంది.