టమాటో చట్నీ!
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం ఏం చేయాలి? ప్రతి మహిళా ఆలోచించేది ఇదే. దోసె, ఇడ్లీ, పరాటా, చపాతీ, ఏ అల్పాహారానికైనా ఏదొక చట్నీ కావాలి. అదే సాంబారు, పల్లి చట్నీ తిని తిని బోర్ కొట్టిందా. అయితే నోరూరించే టేస్టి టేస్టి టొమాటో చట్నీ ఓ సారి ట్రై చేసి చూడండి.
కావలసిన పదార్థాలు:
• టమోటాలు-5
• ఉల్లిపాయలు-2
• నూనె- 4 టీస్పూన్స్
•పచ్చిమిర్చి-4
• రుచికి సరిపడా ఉప్పు
• ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, చిటికెడు పసుపు.
తయారీ విధానం:
• ముందుగా టమోటాలు, పచ్చిమిర్చిని బాగా కడగాలి. • ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిన్నముక్కలుగా కట్ చేయండి.
• బాణాలిలో నూనె వేడి చేసి టొమాటోలు వేయండి.
• టొమాటోలను వేసిన తర్వాత అది చీలిపోకుండా కలుపుతూ ఉండండి.
• సుమారు 5 నుండి 10 నిమిషాలు టమోటాలు ఉడికించాలి. తర్వాత టొమాటో పొట్టు తీసి బాగా మెత్తగా నూరుకోవాలి.
• తర్వాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను టొమాటోలో వేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేయండి.
• అన్నింటినీ బాగా కలపండి.
• ఇప్పుడ మరొక బాణాలిలో నూనె పోసి వేడియ్యాక అందులో జీలకర్ర, ఆవాలు వేయండి. చిటపట అన్నాక కొంచెం పసుపు, కరివేపాకు వేసి ఈ మిశ్రమాన్ని అందులో వేయండి. • నూనె పైకి తేలే వరకు ఉంచండి. తర్వాత స్టౌ ఆఫ్ చేయండి. • అంతే సింపుల్ టొమాటో చట్ని రెడీ. రోటీ, పరోటా, ఇడ్లీ, దోసా మొదలైనవాటితో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.