పెసర ఆవకాయ

 

 

కావలసిన పదార్థాలు:

మామిడికాయలు--2
పెసరపప్పు --3 కప్పులు
కారం --2 కప్పులు
ఉప్పు --2 కప్పులు
నూనె -- 3 కప్పులు

 

తయారీ విధానము:

మామిడికాయలు శుభ్రంగా కడిగి, తుడుచుకొని, చిన్నముక్కలుగా కోసుకోవాలి. పెసరపప్పు ఎండబెట్టి మెత్తగా పొడిచేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పెద్దగిన్నె తీసుకొని, తరిగిపెట్టిన మామిడి ముక్కలులో-- ఉప్పు, కారం, పెసరపిండి & నూనె అన్నీ వేసి కలపాలి. ఇప్పుడు దీనిని జాడీలోకి ఎత్తి దాచుకోవాలి. వేసవి కాలంలో, పెద్ద ఆవకాయకి బదులు... ఈ పెసర ఆవకాయ ని వాడితే వేడి చెయ్యకుండా ఉంటుంది. ఇది 4 నెలలు నిల్వ ఉంటుంది.

 

శ్వేత వాసుకి