ఒడిశా ఆవకాయ
కావలసిన పదార్థాలు..
మామిడికాయలు - నాలుగు
ఎండుమిర్చి - ఐదు
ఆవాలు - ఒక చెంచా
జీలకర్ర - ఒక చెంచా
కరివేపాకు - ఒక రెమ్మ
ఆవనూనె - రెండు చెంచాలు
ఉప్పు - తగినంత
చక్కెర - ఒక కప్పు
సోంపు పొడి - ఒక చెంచా
కారం - ఒక చెంచా
పసుపు - ఒక చెంచా
తయారీ విధానం..
మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోయాలి. స్టౌ మీద గిన్నె పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. వేగిన తరువాత మామిడి ముక్కలు వేయాలి. రెండు క్షణాల తరువాత పసుపు కూడా చల్లి ఓ నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఆ తరువాత కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టాలి. సన్నని మంట మీద ఐదు నిమిషాల పాటు ఉడకనిచ్చి చక్కెర వేయాలి. చక్కెర కరిగి పాకంలా అవుతున్నప్పుడు దించేయాలి. ఆపైన సోంపు పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. దీన్ని మూత గట్టిగా ఉండే సీసాలో వేసి ఫ్రిజ్ లో పెడితే చాలాకాలం నిల్వ ఉంటుంది. పరాఠాల్లోకీ పుల్కాల్లోకీ మంచి కాంబినేషన్.
- Sameera