నార్త్ ఇండియన్ ఆవకాయ
ఆవకాయ సీజన్ వచ్చేసింది. రకరకాల ఆవకాయలు పెట్టుకోకపోతే ఎలాగ. మనం ఎప్పుడూ పెట్టుకునే మామిడికాయ ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ ఇలాంటి వాటితో పాటు కాస్త వెరైటీగా ఉండే ఆవకాయలు పెడితేనో? ఇక ఆలస్యం దేనికి రండి నార్త్ ఇండియా వాళ్ళు పెట్టె ఆవకాయ ఎలా ఉంటుందో కూడా ట్రై చేసి చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
మామిడికాయ ముక్కలు - 2 1/2 కేజీ
మెంతిపొడి - 100 గ్రా
సోంఫు పొడి - 100 గ్రా
కారం - 50 గ్రా
గడ్డివాము - 50 గ్రా
మిరియాల పొడి -2 చెంచాలు
పసుపు - 1/2 చెంచా
ఉప్పు - 1/4 కేజీ
నువ్వులనూనె లేదా ఆవనూనె - 1 1/2 లీ
తయారి విధానం:
ఆవకాయ పెట్టటానికి ముందుగా మనం అన్ని పొడులని కలుపుకోవాలి. ఒక పెద్ద డిష్ తీసుకుని అందులో మెంతిపొడి, సోంఫు పొడి, గడ్డివాము, మిరియాలపొడి, పసుపు, ఉప్పు కారం ఆన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి. అందులో కాస్త నునె వేసి పొడి మొత్తం అంటేలా కలుపుకోవాలి. అలా కలిపి పెట్టుకున్న పొడిలో మామిడికాయ ముక్కలు వేస్తూ అన్నిటికి కారం పొడి అంటేలా చూసుకోవాలి. ఒక జాడీలో కాస్త నూనె వేసి అందులోకి మామిడిముక్కలు వేస్తూ కారం కూడా వేస్తూ మొత్తాన్ని జాడీలోకి ఎత్తి పెట్టాలి. మధ్యమధ్యలో నూనె వేస్తూ మొతాన్ని కిందామీదా కలుపుకుంటే చాలు. ఒక మూడు రోజుల తర్వాత మళ్లీ మొత్తం ఆవకాయని కలుపుకుని తినటం మొదలుపెట్టేయచ్చు. కాస్త వెరైటీగా ఉండే మసాలా నార్త్ ఇండియా ఆవకాయ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూడటమే.
...కళ్యాణి