మామిడికాయ తురుము పచ్చడి 

 

కావలసినవి:

మామిడికాయ తురుము - ఒక కప్పు

వేయించిన ఆవాలు - ఒక స్పూన్

మెంతులు - ఒక స్పూన్   

కారం - మూడు స్పూన్లు

ఇంగువ - అరా స్పూన్   

ఉప్పు-   తగినంత

పసుపు - తగినంత

నూనె - సరిపడగా

 

తయారీ :

ముందుగా ఆవాలు, మెంతులు వేయించి పొడిచేసుకోవాలి. మూకుడులో నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఇంగువ పోపు వేసి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని కారం, మెంతులు, ఆవాల పొడి వేసి పక్కన పెట్టుకోవాలి. అదే మూకుడులో మరికాస్త నూనె వేసి మామిడి తురుము, పసుపు, ఉప్పు, వేసి మగ్గనివ్వాలి. కొద్దిసేపు మగ్గిన తరువాత దీనిలో పక్కకు తీసిపెట్టుకున్న కారం, మెంతిపొడి వేసిన నూనె వేసుకుని కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఈ పచ్చడిని  వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవాలి...