మామిడి అల్లం పచ్చడి
కావలసినవి :
మామిడి అల్లం - అర కేజీ
చింతపండు - కేజీ
కారం - 2 డబ్బాలు.
ఉప్పు - 4 డబ్బాలు.
మెంతిపిండి -కొద్దిగా
పచ్చిశనగపప్పు - ఒక స్పూన్
ఆవాలు - ఒక స్పూన్
ఎండుమిర్చి - రెండు
మెంతులు -ఒక స్పూన్
తయారీ:
ముందుగా మామిడి అల్లం చెక్కు తీసి ముక్కలు కట్ చేసి ఎండనివ్వాలి. తరువాత స్టవ్ వెలిగించి గిన్నెపెట్టి నీళ్ళు పోసి మరిగాక స్టవ్ ఆఫ్ చేసి అందులో చింతపండు, ఉప్పు వేసి ఒక పూట నాననివ్వాలి. అవి నానిన తరువాత అల్లం ముక్కలు గ్రైండర్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి అందులోనే నానపెట్టుకున్న చింతపండు, ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు,ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు వేసి వేగాక స్టవ్ ఆఫ్ చేసి తాలింపు చల్లారక గ్రైండ్ చేసుకున్నపచ్చడిలో వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.