కొబ్బరి మామిడి పచ్చడి
కావాల్సిన పదార్థాలు:
మామిడికాయ - 1
మెంతులు - చిటికెడు
కొబ్బరి ముక్కలు - 1 కప్పు
ఆవాలు - ఒక స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - రెండు స్పూన్లు
ఇంగువ - చిటికెడు
పసుపు - అర స్పూన్
ఎండుమిరపకాయలు - మూడు
తయారీ:
ముందుగా మామిడికాయను చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టి నూనె పోసి కాగాక ఆవాలు, మెంతులు, ఇంగువ, మిరపకాయలు వేయించాలి. ఇప్పుడు వేయించుకున్నవాటిని మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తరువాత మామిడి, కొబ్బరి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి... కొబ్బరి మామిడి పచ్చడి రెడీ