కేరళ ఆవకాయ 

 

 

కావలసిన పదార్థాలు:

 

పచ్చి మామిడికాయ ముక్కలు - రెండు కప్పులు

ఉప్పు - రెండు టీ స్పూన్లు

నూనె - పావుకప్పు

ఆవాలు - రెండున్నర టీ స్పూన్లు

మెంతులు - అర టీ స్పూన్లు

కరివేపాకు రెమ్మలు - రెండు

కారం - మూడు టీ స్పూన్లు

వెనిగర్ - రెండు టీ స్పూన్లు

 

తయారీ విధానం:

 

మామిడి ముక్కలు మరీ పెద్దగా కాకుండా చిన్నవిగా కట్ చేసుకోవాలి.

వీటికి ఉప్పు పట్టించి అరగంట పాటు పక్కన ఉంచాలి.

రెండు టీ స్పూన్లు ఆవాలు, మెంతుల్ని మెత్తని పౌడర్ లా చేసుకోవాలి.

స్టౌ మీద గిన్నె పెట్టి నూనె వేయాలి... వేడెక్కాక మిగిలిన ఆవాలు వేయాలి... చిటపటలాడాక ఆవాలు, మెంతుల పొడిని వేయాలి.

తరువాత కారం, కరివేపాకు కూడా వేసి ఐదు సెకన్ల పాటు వేయించాలి.

ఆపైన ఉప్పు పట్టించిన మామిడి ముక్కలు వేసి బాగా కలపాలి.

రెండు క్షణాల తరువాత వెనిగర్ కూడా వేసి కలిపి ఇంకాసేపు వేయించాలి.

మామిడి ముక్కలకు అన్నీ బాగా పట్టేవరకూ వేయించి దించేయాలి.

ఈ మిశ్రమాన్ని మూత గట్టిగా ఉండే సీసాలో వేసి భద్రపరచాలి.

 - Sameera