ఫిష్ ఆవకాయ
కావలసిన పదార్థాలు:
బోన్ లెస్ చేప ముక్కలు - ¼ kg
కారం - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - ½ టీ స్పూన్
పసుపు - ½ టీ స్పూన్
కారం ఉప్పు ఆవపిండి కలిపిన పొడి - 4 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్ స్పూన్
గసగసాల పొడి - ¼ టీ స్పూన్
ధనియాల పొడి - 2 టీ స్పూన్లు
జీలకర్ర పొడి - ½ టీ స్పూన్
గరంమసాల - ¼ టీ స్పూన్
నూనె - 1 కప్పు
వెనిగర్ - ½ టేబుల్ స్పూన్
తయారు చేసే విధానం:
1. ముందుగా ఒక బాణలిలో సగం నూనె పోసి చేప ముక్కలను వేయించాలి. చేప ముక్కలను జాగ్రత్తగా విడిపోకుండా వేయించాలి. దీనిలో వెనిగర్ వేసి సన్నని మంటపై 10 నిమిషాలు వేపాలి.
2. తరువాత కొద్దిగా పసుపు వేసి ముక్కలు ఎర్రబడే వరకు వేపాలి. ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
3. తరువాత దీనిలో మిగిలిన పసుపు, ధనియాల పొడి, గరంమసాల, జీలకర్ర పొడి, గసగసాల పొడి, మిగిలిన నూనె వేసి కలపాలి.
4. దీనిని కాసేపు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత కారం ఉప్పు ఆవపిండి కలిపిన పొడి వే