చికెన్‌ పచ్చడి

 

 

 

కావలసిన పదార్థాలు:-

బోన్‌లెస్‌ చికెన్‌ - అరకిలో

వెల్లుల్లి - ఒకటి (మెత్తగా నూరుకోవాలి )

నూనె - అరకిలో

యాలకులు - 1

లవంగాలు - 2

కారం - అరకప్పు

నిమ్మకాయ - ఒకటి

ఉప్పు - గరిటెడు

దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క (మసాలా దినుసులు పొడిగొట్టుకోవాలి)

 

తయారు చేసే విధానం:-

ముందుగా మనం తెచ్చుకున్న చికెన్‌ ముక్కలని కడిగి ఒక బట్టమీద వేసి కాసేపు ఆరబెట్టుకోవాలి.

స్టౌ వెలిగించుకుని గిన్నె పెట్టి కావాల్సినంతగా నూనె పోసి చికెన్‌ ముక్కలని బాగా వేయించుకోవాలి. చికెన్‌ ముక్కలు నూనెలో ఉడికిందీ లేనిదీ చూసుకొని (మరీ గట్టిపడకుండా) చిల్లులు పడిన గరిటెతో నెమ్మదిగా గిన్నెలోకి తీసుకోవాలి.

స్టౌ ఆర్పివేయాలి. మూకుడులో ఒక కప్పు లేదా కప్పున్నర నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసివేయాలి. ఇది వేడిగానే ఉంటుంది కాబట్టి ఇందులో నూరిన వెల్లుల్లి ముద్ద, ఇష్టమైతే కొద్దిగా కరివేపాకు, మసాలా పొడి, కారం, ఉప్పు వేసి గిన్నెలోకి తీసుకున్న చికెన్‌ ముక్కలను కూడా ఇందులో వేయాలి.

గరిటెతో బాగా కలిపి వేడి తగ్గిన తరువాత నిమ్మకాయ రసం పిండాలి. ఇది బాటిల్‌లోకి తీసుకుని పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది.