బెంగాలీ బెల్లం ఆవకాయ

 

 

 

కావలసిన పదార్థాలు:

పచ్చిమామిడికాయలు                 - ఒక కిలో
బెల్లం                                          - ఒక కిలో
చక్కెర                                        - అరకిలో
పసుపు                                      - ఒక చెంచా
మెంతులు                                   - ఒక చెంచా
ఉప్పు                                         - అరచెంచా
ఆవనూనె                                    - మూడు చెంచాలు
ఎండుమిర్చి                                 - రెండు

 

తయారీ విధానం:

మామిడికాయల్ని శుభ్రంగా కడిగి... మరీ లావుగా కాకుండా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. వీటిని ఓ గిన్నెలో వేసి, కొద్దిగా నీరు పోసి, పది నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తరువాత ఉప్పు, పసుపు వేసి కలిపి కాసేపు వదిలేయాలి. మెంతులు, ఆవాల్ని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక మామిడి ముక్కలు వేసి వేయించాలి. కొద్దిగా రంగు మారిన తీసేయాలి. అదే నూనెలో ఎండు మిర్చి కూడా వేసి వేయించాలి. వేగాక బెల్లం వేయాలి. బెల్లం కరిగిన పాకం పడుతున్నప్పుడు చక్కెర కూడా వేసెయ్యాలి. రెండూ చిక్కని పాకంలాగా అయ్యాక మామిడి ముక్కలు వేసి బాగా కలపాలి. పాకం ముక్కలకు బాగా అంటి, చూడటానికి హల్వాలాగా తయారవుతుండగా ఆవాలు, మెంతుల పొడిని వేసి మరి కాసేపు ఉడికించాలి. మిశ్రమం బాగా దగ్గర పడిన తర్వాత దించేసుకోవాలి. దీన్నిఓ పళ్లెంలో పలుచగా పరిచి మూడు నాలుగు రోజుల పాటు ఎండలో పెట్టాలి. ఆ తరువాత సీసాలో కానీ జాడీలో కానీ వేసి భద్రపరచాలి. 

 

 - Sameera