EVENTS
న్యూ జెర్సీ లో తెలుగు కళాసమితి ఉగాది వేడుకలు

 

ఈస్ట్ బ్రన్స్విక్ మిడిల్ స్కూల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థానిక తెలుగు కళాసమితి (TFAS) నిర్వహించిన ఉగాది ఉత్సవాలకు 1,000 మంది హాజరయ్యారు.  చక్కటి నీలాకాశంలో, NATS సహసమర్పణ లో, ప్రఖ్యాత సాహిత్య మరియు తెలుగు సినీ చిత్ర ప్రముఖులు శ్రీ తనికెళ్ళ భరణితో ఇష్టాగోష్టి కార్యక్రమం 3:45 PM కి ప్రారంభమైంది. 300 పైగా స్థానిక సాహిత్య ప్రేమికులు, ప్రేక్షకులతో జరిగిన ఇష్టాగోష్టి మనోరజకంగా సాగింది.

 

 

స్థానిక సంగీత, నృత్య పాతశాలల విద్యార్ధినీ, విదార్ధులు తమ తమ ప్రతిభతో ఆహూతుల ప్రశంసలను అందుకొన్నారు.  స్థానిక "I-Spice" రెస్టారంట్ ద్వారా విందుభోజనం ఏర్పాటు చేసారు. TFAS ధర్మకర్తలు సాంప్రదాయ ఉగాది పచ్చడి సిద్దం చేసి అందరికి అందచేసారు.  విందు కార్యక్రమం తర్వాత, సినీ గాయకుడు, సంగీత దర్శకుడు, పార్థసారధి మరియు గాయని, మణి శాస్త్రి మరియు స్థానిక వర్ధమాన గాయని ఉజ్వల చేసిన సంగీత విభావరి కి విశేష స్పందన వచ్చింది. NATS, ATA, TANA, NATA,TFAS మరియు  VT సేవాసంస్థల ఉద్దండుల మధ్య , TFAS గత అధ్యక్షులు శ్రీ దాము గేదెల చేతులమీదుగా తనికెళ్ళ  భరణి దర్సకత్వం లో రాబోతున్న చిత్రం "మిధునం" ఆడియో విడుదల జరిగింది.

 

 

 ఈ ఆడియో CD నుంచి 3 పాటలకు స్థానిక నృత్య ఉపాధ్యాయినిలు దృశ్య రూపాన్ని ఇచ్చి తమ స్కూల్ పిల్లల ప్రతిభని నిరూపించారు. వారిప్రతిభని కళ్లారా చూసిన భరణి, చమర్చిన కళ్ళతో అభినందిస్తూ, కేవలం 2 రోజుల వ్యవధిలో, ఎంతో గొప్పగా దర్సకత్వం వహించి పిల్లలతో ప్రదర్శన ఏర్పాటు చేసిన టీచర్స్ ను అభినందనలతో ముంచెత్తారు.  మిధునం గురించి భరణి చెప్తూ ఈ సినిమా ఒక దృశ్య కావ్యం గా ఉంటుందని అది NRI ల మనస్సులను తప్పక స్పృజిస్తుందని కృతజ్ఞతా ప్రూర్వకంగా అన్నారు.

 

 

భరణి స్వీయ దర్సకత్వంలో, తను రాసిన  "నరికేస్తాన్ ర్రోయి" అనే సందర్హోచిత, షడ్రసోపేతమైన ఈ ప్రదర్శనను TFAS సభ్యులు కేవలం రెండు రోజుల్లో సాధన చేసి  సభికుల మన్నలను అందుకొన్నారు. 500 వరకూ తెలుగు సినిమాలలో నటనతోపాటు తెలుగు సాహిత్యానికి చేసిన సేవకు, ఆసమాన ప్రతిభకు గుర్తింపుగా తనికెళ్ళ భరణి కి న్యూ జెర్సీ  శాసనసభ్యుడు శ్రీ ఉపేంద్ర చివుకుల అధికారపూర్వక ప్రకటనను చదివి అందించారు. అవుట్గోయింగ్ అధ్యక్షుడు ఆనంద్ పాలూరి సంస్థ గురించి మాట్లాడుతూ, TFAS ఎంతో బలంగా ఆర్ధికంగా ధృడంగా వుందని అన్నారు.  TFAS కార్యక్రమాల నాణ్యత కోసం, ఎంతో మంది కీలక సభ్యులు, నాన్ సభ్యుల సహాయ సహకారాలు మరువలేనివని కొనియాడారు.  

 

 

సంస్థ గత ఏడాది కార్యక్రమాల గురించి సమీక్ష చేస్తూ, ఇంతకాలమైనా TFAS కి ఇంతవరకూ స్వంత భవనం లేదని నిరాశ వ్యక్తం చేస్తూ, రాబోయే అధ్యక్షులు శ్రీమతి మంజు భార్గవి నాయకత్వంలో సంస్థ అభివృద్ధి చెంది సుసంపంనమవ్వాలని ఆకాంక్షించారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్  మంజు భార్గవ, తనకు TFAS ద్వారా కమ్యునిటీ సర్వీసు చేసే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ, మున్ముందు విజయవంతమైన పదవీకాలం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.  అవుట్గోయింగ్ ప్రెసిడెంట్ ఆనంద్ పాలూరి  ప్రస్తుత ట్రస్టీలకు. వారి కుటుంబసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

 

 

అనంతరం, కొత్త ట్రస్టీలచే శ్రీ బండారు రాజారావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం, పార్థు, మణి శాస్త్రి,ఉజ్వల్ ల గానామృతం కొనసాగింది. స్థానిక యువతీ, యువకులు శ్రావ్యమైన పాటలకు కదం తొక్కారు.  TFAS ఈ ముగ్గురు కళాకారులనూ సన్మానించింది. అనార్యోగ్యంతో వున్నా, బన్నీ సినిమా హీరొయిన్ గౌరీ ముంజాల్ ఈ కార్యక్రమానికి ప్రత్యెక ఆకర్షణగా నిలించింది. ఈ కార్యక్రమమానికి సహాయ సహకారాలు అందిచిన మీడియాకి, కళాకారులకి కృతజ్ఞలతో చెప్తూ, భార్గవ వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది.   

 

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;