RELATED EVENTS
RELATED ARTICLES
RELATED NEWS
EVENTS
బ్లూవింగ్టన్ - నార్మల్ లో అన్నమాచార్య సంకీర్తన రవళి

తెలుగు అసోసియేషన్ ఆఫ్ బ్లూవింగ్టన్ - నార్మల్ ఆధ్వర్యంలో గత శనివారం September 17th స్థానిక BCC Auditorium లో సంగీత కళానిధి గుంటి నాగేశ్వరనాయుడి గారి అన్నమాచార్య సంకీర్తన గాన కార్యక్రమం రసజ్ఞులను విశేషంగా ఆకట్టుకొన్నది. ఈ కార్యక్రమానికి పిల్లలు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరు అయినారు "అదివో అల్లదివో శ్రీ హరివాసము", “కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు" “నారాయణ కె నమోః", “బ్రాహ్మమొకటే" మరియు "ఆలివేళు మంగ హరి అంతరంగ" ఇత్యాది సుపరిచిత కీర్తనలతో పాటు అనేక ఇతర అన్నమాచార్య కీర్తనలతో నాగేశ్వరనాయుడు గారు ప్రాంగణాన్ని ఆధ్యాత్మికం చేశారు. గోవిందా నామస్మరణతో సభికులందరూ తన్మయత్నం చెందారు.

ఈ కార్యక్రమానికి Indian Musical Society of Illinois వారు వాద్యసహకారం అందించారు శ్రీ మన్ ప్రేత్ బేది తబలా వాదన పలువురిని మంత్ర ముగ్దుల్ని చేసింది. శ్రీ ప్రసన్న మాటే శ్రీమతి హిరణ్యయి గడ్డ హర్ముణియం మరియు వీణ సహకారం అందించారు.

చివరిగా శాలువా జ్ఞాపికలతో శ్రీ నాగేశ్వర నాయుడి గారిని నగర ప్రముఖులు ఘనంగా సత్కరించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;