చికాగో ఆంధ్రా సంఘం వారి వేసవి వనభోజనాలతో చికాగో నగరం తెలుగు వంటకాల రుచులతో, ఆంధ్రా పద్ధతులతో కళకళలాడింది. ప్రతి ఏడూ లాగే, ఈ ఏడాది కూడా ఫాథర్స్ డే వారోత్సవాన 6/16న శాంబర్గ్ లోని బస్సే పార్క్ ఉదయం 11 గంటల నుంచి, సాయంత్రం 6 దాకా పెద్దలు పిల్లలు అందరూ ఆటలు, పాటలు, విందు భోజనాలతో ఆనందించారు.
ఫాథర్స్ డే సంధర్బంగా చివర్లో కేక్ కట్ చెయ్యడంతో పాటు వేసవి తాకిడిని ఎదుర్కోడానికి రోజంతా మజ్జిగ, పుచ్చకాయ ముక్కల్ని అందుబాటులో ఉంచారు.
ఈ కార్యక్రమంలో CAA అధ్యక్షురాలు Dr. ఉమ కటికి, ఉపాధ్యక్షులు పద్మారావు అప్పలనేని, కార్యదర్శి భార్గవి నెట్టం, ఫౌండర్స్ చైర్మన్ దినకర్ కారుమురి తో పాటు గత ఫౌండర్స్ సభ్యులు సుందర్ దిట్టకవి, శ్రీనివాస్ పెదమల్లు, రాఘవ జట్ల, రమేష్ గారపాటి సహా బోర్డు సభ్యుడు, సభ్యురాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం విశేషం.
చివరిలో అధ్యక్షురాలు ఉమ కటికి మాట్లాడుతూ ఈ వనభోజనాలని జయప్రదం చేసిన అతిథులకు, బోర్డు సభ్యులు, వాలంటీర్లకి ధన్యవాదాలు తెలిపారు. చికాగో వాసులని అలరించటానికి ఈ సంవత్సరం CAA ఇలాంటి మరెన్నో కార్యక్రమల్ని నిర్వహించబోతోంది అని, వాటన్నింటికి మనందరి మద్దతు కావాలి అని తెలిపారు.