తానా ప్రపంచ సాహిత్య వేదిక
తెలుగు సాహితీ ప్రియులకు సంక్రాంతి శుభాకాంక్షలు! ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పూర్వాధ్యక్షులు(2019 - 2021) శ్రీ జయశేఖర్ తాళ్లూరి నేతృత్వంలో, తానా పూర్వాధ్యక్షులు (2011 – 2013) డా. ప్రసాద్ తోటకూర సారథ్యంలో, శతశతక కవి శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ సమన్వయం లో, ప్రజా కవి, వాగ్గేయకారుడు శ్రీ వంగపండు ప్రసాద రావు గారు, వారి బృందం నిర్వహణలో మే 31, 2020 న ‘జానపద కళా వైభవం’ అనే కార్యక్రమం తో అంతర్జాలంలో “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆవిర్భవించింది. అప్పటినుంచి డిసెంబర్ 31, 2021 వరకు 20 నెలవారీ కార్యక్రమాలు, 10 ప్రత్యేక కార్యక్రమాలతో తెలుగు భాషా సాహిత్యాలలోని వివిధ అంశాలను స్పృశించడం జరిగింది.
మొత్తం 113 గంటల 50 నిమిషాల 35 సెకెన్ల కాలంగా సాగిన ఈ అక్షరయజ్ఞంలో ప్రపంచం నలుమూలల నుండి 537 మంది సాహితీవేత్తలు, రచయితలు, రచయిత్రులు, సినీ గీత రచయితలు, యువత, అవధానులు, కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు పాల్గొనడం సాహితీ చరిత్రలో ఒక అపూర్వ అధ్యాయం. అప్రతిహతంగా సాగుతున్న ఈ సాహితీ వైభవంలో పాల్గొన్న వారందరికీ, ఆదరించి అభిమానిస్తున్న తెలుగు భాషా ప్రేమికులకు, ప్రసార మాధ్యమాలకు, కార్యకర్తలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈ 30 కార్యక్రమాల మొత్తం వీడియో లంకెలను అన్నింటిని కుదించి ఒక మాతృ లంకె లో పొందుపరిచాము. మీకు వీలున్నప్పుడు ఈ క్రింది లంకెను నొక్కడం ద్వారా అన్ని కార్యక్రమాలను వీక్షించవచ్చును. https://www.youtube.com/playlist?list=PL0GYHgMt2OQzhobYN7BUnlSR9LBS7Xlm8 సదా మీ ఆదరాభిమానాలను కోరుకుంటూ ...... అంజయ్య చౌదరి లావు - తానా ప్రస్తుత అధ్యక్షులు చిగురుమళ్ళ శ్రీనివాస్ – తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయ కర్త డా. తోటకూర ప్రసాద్ - తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు