వైసీపీ కేసు.. సుప్రీంలో డిస్మిస్
posted on Jun 3, 2024 12:48PM
పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తున్న జగన్ పార్టీకి సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్‌కి సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ వైసీపీ వేసిన కేసును సుప్రీం కోర్టు కొట్టేసింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మీద సోమవారం ఉదయం జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారన చేపట్టింది. వైసీపీ తరఫున లాయర్ అభిషేక్ సింఘ్వీ వాదనలను వినిపించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వెలగపూడి రామకృష్ణ ఈ కేసు విషయంలో కేవియట్ దాఖలు చేశారు. ఆయన తరఫున ఆదినారాయణ, సిద్ధార్థ లూధ్రా, రవితేజ పదిరి, జవ్వాజి శరత్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ వైసీపీ దాఖలు చేసిన ఎస్ ఎల్ పిని డిస్మిస్ చేసింది.