వర్రా రవీందర్ రెడ్డి అరెస్టు.. మహబూబ్ నగర్ సమీపంలో పట్టుకున్న పోలీసులు

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రెండు రోజుల కిందల కడప జిల్లా పోలీసుల నుంచి తప్పించుకుని పరారైన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ సమీపంలో అదుపులోనికి తీసుకున్నారు. 

వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో  ఆ పార్టీ అండతో వర్రా రవీందర్ రెడ్డి చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, వంగలపూడి అనిత సహా జగన్ సోదరి షర్మిల, తల్లి విజయమ్మలపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతూ చెలరేగిపోయాడు.  ఆయన పై పలు ఫిర్యాదులు ఉన్నాయి. అయితే వైసీపీ అధికారంలో ఉన్నంత వరకూ వర్రారవీందర్రెడ్డిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.    అలాంటి వర్రా రారవీందర్ రెడ్డిని  రోజుల కిందట  పులివెందులతో పోలీసులు అదుపులోనికి తీసుకుని కడప తరలించారు. అక్కడ పోలీసుల నిర్లక్ష్యంతో వర్రా రవీందర్ రెడ్డి తప్పించుకుని పారిపోయాయడు. కడప ఎంపీ, వైసీపీ నాయకుడు అవినాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడైన వర్రా రవీందర్ రెడ్డిపై కడప, రాజంపేట, మంగళగిరి పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

అటువంటి వర్రా తప్పించుకు పారిపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కడప ఎస్పీపై బదిలీ వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు వర్రా రవీందర్ రెడ్డి కోసం తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు బృందాలుగా ఏర్పడి కడప, పులివెందుల, బెంగళూరు, హైదరాబాద్ లలో గాలింపు చర్యలు చేపట్టారు.  ఈ నేపథ్యంలో వర్రా తెలంగాణా రాష్ట్రానికి పారిపోతుండగా పోలీసులు మహబూబ్ నగర్ సమీపంలో అరెస్టు చేశారు. వర్రాను అక్కడ నుంచి కడపకు తరలిస్తున్నట్లు సమాచారం