మా కార్యక్రమాలు ఎలా చేపట్టాలో వైసీపీ చెప్పాలా?.. పవన్
posted on Oct 16, 2022 11:38AM
అన్నీ తనకు తెలిసే జరగాలని, ఏది జరిగినా తనకు వ్యతిరేకంగా జరగడానికి వీల్లేదన్నధోరణిలో రాజుగారుంటే ప్రజలకు, ప్రతి నిధులకు ఇక స్వేచ్ఛ ఏముం టుంది.. కొద్దిగా ఇలానే ప్రశ్నిం చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయినా సంఘవిద్రోహక కార్యక్రమాలేమీ చేపట్టడంలేదుగదా.. గొంతు నొక్కేయడానికి అనీ ప్రభుత్వాన్ని కళ్యాణ్ ప్రశ్నించారు. ఆయన ఆదివారం మీడి యాతో మాట్లాడుతూ, అసలు జనసేన కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో వైసీపీ చెబు తుందా?మేం ఎక్కడికి వెళ్తామో వైసీపీ నేతలకు చెప్పాలా? అని ప్రశ్నించారు.
ఉత్తరాంధ్ర పర్యటనను మూడు నెలల క్రితమే ఖరారు చేశా మని స్పష్టం చేశారు. ప్రజల సమస్య లు తెలుసుకునేందుకే జన వాణి కార్యక్రమం చేపట్టామని, విధానపరంగా నిర్ణయాలు తీసుకో వాలనేది జనసేన సిద్ధాంత మని చెప్పారు. వైసీపీ నేతలవి ఎప్పుడు బూతు పురాణాలే తప్ప.. సమస్యలను పరిష్కారించ లేదని ఆరోపించారు.
తమ కార్యక్రమం అజెండాలో రాజధానుల అంశం లేదని, రాజు వచ్చినప్పుడల్లా రాజధాని మారిస్తే ఎలా?! అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. నిన్న ఎయిర్‌పోర్టు దగ్గర పోలీసుల ప్రవర్తన సరిగా లేదన్నారు. పోలీస్ శాఖపై తనకు ప్రత్యేక గౌరవం ఉందన్నారు. పోలీసులు నిర్ణయాలు తీసుకోరు.. ప్రభుత్వ సూచనలు పాటిస్తారని, నిన్న జనసేన కార్యకర్తలపై పోలీసులు జులుం చూపారని పవన్ అన్నారు.