జగన్‌కు భజంత్రీలు వైసీపీ మంత్రులు..చింతమనేని
posted on Aug 9, 2022 12:39PM
ప్రజాప్రతినిధులుగా ప్రజల ఇబ్బందులు తెలుసుకుని పరిష్కరించడానికి స్వేచ్ఛ ఉండాలి. అలాంటి స్వేచ్ఛలేనపుడు మంత్రిమండలిలో ఉండి ప్రయోజనమేమిటని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే చింత మనేని ప్రభాకర్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులకు ఏమాత్రం స్వేచ్ఛా లేదని, వారికి ఏ సందర్భంలోనూ తమ అభప్రాయాలను స్వంతంగా చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన వ్యాఖ్యా నించారు. కేవలం వారంత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చిన మాటలను చెప్పడానికే తప్ప స్వయంగా మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయిందని చింతమనేని ఘాటుగా విమర్శించారు.
మంత్రులు కేవలం ముఖ్యమంత్రి జగన్ చెప్పిన దాన్ని అమలు చేయడం, ఆయన మాటలకు చప్పట్లు కొడుతూ భజన చేయడం తప్ప వారంతట వారుగా ఎలాంటి సూచనలు సలహాలివ్వలేని స్థితిలో ఉండ టం శోచనీయమన్నారు. కేవలం సజ్జల మాటే వారు మంత్రించినట్టు చెప్పడం జరుగుతోందని చింత మనేని అన్నారు. దీనికి తోడు వైసీపీ మంత్రులుగాని, ఎమ్మెల్యేలుగాని ఎక్కడా ప్రజాక్షేత్రంలో కాన రారని ఎద్దేవా చేశారు. దళితులను ఆదుకుంటున్నాం, వారికి పదవులిచ్చి వారిని గౌరవిస్తున్నామని డంబాలు పలకడం తప్ప నిజానికి వారికి ఎలాంటి అధికారమూ ఇవ్వలేదని అన్నారు. పైరుకు వారికి పదవులి చ్చినప్పటికీ పెత్తనం మాత్రం వేరే వారు చెలాయిస్తున్నారని చింతమనేని మండిపడ్డారు. దళితులను ఇంతకంటే ఎవ్వరూ తక్కువ చూడరని అన్నారు.
గోరంట్ల ఎపిసోడ్ గురించి ప్రస్తావిస్తూ, ఎంపీ చేసిన పనిని కప్పిపుచ్చుకోవడానికి అది తమ ఎంపీ పనికాదని, మార్ఫింగ్ చేశారని వేరేవాళ్లమీద నేరం నెట్టే ప్రయత్నాలు చేయడం దారుణమని చింత మనేని విమర్శించారు. దీనికి తోడు అసలా ఎపిసోడ్‌పై హోంమంత్రి ఇంతవరకూ స్పందించక పోవ డాన్ని ఆయన తప్పుపట్టారు.