టీడీపీ కార్యకర్తలకు తాగునీరు కట్! సీఎం.. ఇదేం మూర్ఖత్వం.. 

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లోనూ వైసీపీ నేతలు కక్ష రాజకీయాలు చేస్తున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా కర్నూల్ జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది. తెలుగు దేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నారనే కోపంతో తాగునీరు కట్ చేసిన అరాచక ఘటన వెలుగులోనికి వచ్చింది. 

కర్నూలు జిల్లా బసలదొడ్డిలో టీడీపీ సానుభూతి పరులకు తాగునీరును స్థానిక వైసీపీ నేతలు నిలిపివేయించారు. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల వరకే రాజకీయాలు. ప్రభుత్వంలోకి వచ్చాక ప్రజలందరినీ సమానంగా చూడాలి. కానీ జగన్‌రెడ్డి... కుల, మత, ప్రాంత, పార్టీల వారీగా విభజించి పాలిసున్నారని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రి కాదు.. మూర్ఖమంత్రి అని నిరూపించుకుంటున్నారని  రా లోకేశ్‌ విమర్శించారు.  తీవ్రంగా ఖండించారు. అవినీతి, అక్రమాలను నిలదీస్తున్న ప్రతిపక్షంపై తప్పుడు కేసులు బనాయిస్తున్న ముఖ్యమంత్రి.. ప్రజలపైనా కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణమని మండిపడ్డారు. ఒక ఫ్యాక్షనిస్టు సీఎం అయితే ఎంత ఘోరంగా ఉంటుందో జగన్‌రెడ్డి పాలననే నిదర్శనమని ధ్వజమెత్తారు. టీడీపీ హాయంలో రాష్ట్రమంతా అభివృద్ధి, సంక్షేమం కనిపించేవని, వైసీపీ పాలనలో హత్యలు, దోపిడీలు, అరాచకాలే కన్పిస్తున్నాయని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ఏపీని హత్యా రాజకీయాల కేంద్రంగా మార్చారని లోకేష్ మండిపడ్డారు.

కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం బసలదొడ్డిలో టీడీపీ సానుభూతి పరులకు తాగునీరు నిలిపివేయడం హేయమని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ‘‘జగన్‌రెడ్డి ఎన్నికలకు ముందు కులం, మతం చూడం అని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల వాళ్లకు కనీసం తాగునీరు కూడా ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇది దుర్మార్గం. దీనిని ఖండిస్తున్నాం’’ అని ఆయన మండిపడ్డారు. ‘‘టీడీపీకి ఓట్లు వేస్తే తాగటానికి నీరివ్వరా? జగన్‌ సీఎంగా సేవ చేయాల్సింది రాష్ట్ర ప్రజలందరికీనా? లేక వైసీపీ కార్యకర్తలకేనా? టీడీపీకి ఓటేశారని తాగునీళ్లు, రేషన్‌, పింఛన్‌ ఆపేయడం జగన్‌ ఫ్యాక్షన్‌ మనస్తత్వానికి నిదర్శనం’’ అని విమర్శించారు. రాజారెడ్డి రాజ్యాంగానికి మరో మూడేళ్లే వాలిడిటీ అన్నారు. తర్వాత వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. ఆరోజు నుంచి జగన్‌, వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రతి రోజూ పశ్చాత్తాప పడాల్సి వస్తుందని అచ్చెన్న హెచ్చరించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu